AP KGBV Merit List 2023: కేజీబీవీల్లో టీచర్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ మెరిట్‌లిస్ట్ విడుదల.. జూన్ 19 ఫైనల్‌ మెరిట్‌లిస్టు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన 1358 ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు మరో 197 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్‌లిస్టు (తాత్కాలిక) గురువారం..

AP KGBV Merit List 2023: కేజీబీవీల్లో టీచర్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ మెరిట్‌లిస్ట్ విడుదల.. జూన్ 19 ఫైనల్‌ మెరిట్‌లిస్టు ప్రకటన
AP KGBV
Follow us

|

Updated on: Jun 15, 2023 | 3:19 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన 1358 ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు మరో 197 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్‌లిస్టు (తాత్కాలిక) గురువారం (జూన్‌ 15) విడుదలైంది. ఈ మేరకు తెలియజేస్తూ రాష్ట్ర పథక సంచాలకుడు శ్రీనివాసరావు ప్రకటన వెలువరించారు. తాజాగా విడుదలైన ప్రొవిజినల్ మెరిట్‌లిస్టుపై జూన్‌ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాల్లో అభ్యంతరాలు సమర్పించొచ్చని ఆయన తెలిపారు. అనంతరం జూన్ 19న ఫైనల్ మెరిట్‌లిస్టు విడుదల చేస్తామని వెల్లడించారు. తుది ఫలితాలు విడుదలైన తర్వాత జూన్‌ 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. జిల్లా కమిటీలు జూన్ 22 నుంచి 24 వరకు అభ్యర్థులకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం జూన్‌ 25న నియామక పత్రాలు జారీ చేస్తామని ఆయన వివరించారు. కాగా ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ టీచర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించి మహిళా అభ్యర్ధులకు ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ మందుల ధరలు ఖరీదైనవి.. ఏయే మెడిసిన్‌ రేట్లు పెరిగాయంటే..!
ఈ మందుల ధరలు ఖరీదైనవి.. ఏయే మెడిసిన్‌ రేట్లు పెరిగాయంటే..!
కేంద్రం సంచలన నిర్ణయం.. వారికి వీవీఐపీ సెక్యూరిటీ తొలగింపు!
కేంద్రం సంచలన నిర్ణయం.. వారికి వీవీఐపీ సెక్యూరిటీ తొలగింపు!
నిబంధనలు తెలియకపోతే జేబుకు చిల్లేఆ క్రెడిట్ కార్డుల రూల్స్ మార్పు
నిబంధనలు తెలియకపోతే జేబుకు చిల్లేఆ క్రెడిట్ కార్డుల రూల్స్ మార్పు
అతనికే రూ. 23 కోట్లు.. సన్‌రైజర్స్ సంచలన రిటెన్షన్‌ లిస్ట్‌?
అతనికే రూ. 23 కోట్లు.. సన్‌రైజర్స్ సంచలన రిటెన్షన్‌ లిస్ట్‌?
గురు గ్రహానికి చందమామలాంటి.. యూరోపాలో మహా సముద్రం
గురు గ్రహానికి చందమామలాంటి.. యూరోపాలో మహా సముద్రం
సీఎం నేతృత్వంలో జర్మనీలో ఉన్నత స్థాయి బృందం పర్యటన..
సీఎం నేతృత్వంలో జర్మనీలో ఉన్నత స్థాయి బృందం పర్యటన..
వరుణ్ ధావన్-సామ్.. సూపర్ కెమిస్ట్రీ
వరుణ్ ధావన్-సామ్.. సూపర్ కెమిస్ట్రీ
ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే.. 50 శాతం ప్రసవాల్లో ట్విన్సే పుడతారు
ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే.. 50 శాతం ప్రసవాల్లో ట్విన్సే పుడతారు
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
తండ్రీ కుమారులను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కాంట్రాక్ట్‌
తండ్రీ కుమారులను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కాంట్రాక్ట్‌