AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayagan: జన నాయగన్‌కు లైన్ క్లియర్.. అదొక్కటే ట్విస్ట్

Jana Nayagan: జన నాయగన్‌కు లైన్ క్లియర్.. అదొక్కటే ట్విస్ట్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 11, 2026 | 6:22 PM

Share

తమిళనాడులో విజయ్ రాజకీయ విజయం తర్వాత, అతని చివరి సినిమా 'జన నాయగన్' విడుదలపై ఉత్కంఠ పెరిగింది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం ఇప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది. అభిమానులు టైటిల్ కార్డులో 'తమిళనాడు ముఖ్యమంత్రి'గా విజయ్ పేరు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. KVN ప్రొడక్షన్స్‌కు ఇది కీలకం, ఇతర సినిమాలపై ప్రభావం చూపుతుంది.

విజయ్ విజయ్.. ఇప్పుడెక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పొలిటికల్ హీట్ నడుస్తున్న వేళ.. సడన్‌గా జన నాయగన్ ట్రెండ్ అవుతుంది. విజయ్ విజయం సాధించిన రోజు నుంచే ఈ సినిమాకు ఊపొచ్చినా.. తాజాగా ఫ్యాన్స్ ఖాతాలో మరో డిమాండ్ చేరిపోయింది. ఇంతకీ ఏంటా డిమాండ్.. ఎందుకు ఈ ట్రెండింగ్.. తమిళనాడులో రాజకీయాలు ఎంత వేడిగా, ఆసక్తికరంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో విజయ్ సంచలన విజయం సాధించిన తర్వాత 5 నెలలుగా విడుదలకు దూరంగా ఉన్న జన నాయగన్ సినిమాపై ఒకేసారి అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల కారణంగా బయటికి రాలేదు. విజయ్ పాలిటిక్స్‌లో ఉన్నందుకే జన నాయగన్ సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొందనేది కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వమే వచ్చేలా ఉంది. దాంతో జన నాయగన్ రిలీజ్ నల్లేరుపై నడకే. కానీ ఇక్కడే ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన కోరికల చిట్టా ఒకటి బయటికొస్తుంది.. ఇదే విషయాన్ని తమ జన నాయకుడి దృష్టికి తీసుకెళ్తున్నారు వాళ్లు. విజయ్ ఇన్నాళ్లూ కేవలం హీరో మాత్రమే.. కానీ ఇప్పుడలా కాదు. ఆయనపై చాలా బరువు బాధ్యతలున్నాయి. ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పేసారు విజయ్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న చివరి సినిమా జన నాయగన్ టైటిల్ కార్డులో తమ హీరో పేరుకు ముందు ఛీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. జన నాయగన్ విడుదల KVN ప్రొడక్షన్స్‌కు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది విడుదలై విజయం సాధిస్తే.. టాక్సిక్‌తో పాటు చిరంజీవి, బాబీ సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా జన నాయకుడిని బయటికి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తానికి చూడాలిక.. టైటిల్ కార్డులో CM ఆఫ్ తమిళనాడు అని పడుతుందో లేదో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

Follow Us