Dhurandar 3: ఇదెక్కడి మాస్.. ధురంధర్ కథ పూర్తవ్వలేదా..?
ధురందర్ 2 కథ ముగిసిందని అనుకుంటే, నిర్మాత జ్యోతి దేశ్‌పాండే ధురందర్ 3 ఖాయం అని ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 2026 చివరలో విడుదల కావచ్చని హింట్ ఇచ్చారు. పార్ట్ 3 కోసం హంజా లక్ష్యాలు, రణ్‌వీర్ సింగ్ ప్రస్తుత షెడ్యూల్ ప్లాన్స్ పై ఆసక్తి నెలకొంది. ఫ్రాంచైజీ బ్రాండ్‌ను నిలబెట్టడానికి మేకర్స్ ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ధురందర్ కథ ఇంకా అయిపోలేదా..? పార్ట్ 3 కూడా ఉండబోతుందా..? ఏకంగా నిర్మాతే న్యూస్ కన్ఫర్మ్ చేసారు.. దాంతో ఈ కథ ఇంకా అయిపోలేదని క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 3 ఎలా ప్లాన్ చేయబోతున్నారు..? ఇదే ఏడాది సర్‌ప్రైజ్ ఉంటుందన్నారు మేకర్స్. ఒకవేళ అది నిజమే అయితే ధురంధర్ 3 ఎప్పుడు రాబోతుంది..? హంజా నెక్ట్స్ టార్గెట్స్ ఏంటి..? ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలుకొట్టిన సినిమా ధురంధర్. కేవలం 4 నెలల గ్యాప్‌లో రెండు పార్ట్స్‌గా వచ్చిన ఈ చిత్రం.. ఏకంగా 3000 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు పార్ట్స్ 1000 కోట్లు దాటాయి.. రెండో పార్ట్ 1700 కోట్లు దాటేసింది. చాలా కాలంగా పాతుకుపోయిన బాహుబలి 2 నార్త్ అమెరికా రికార్డ్ సైతం ధురంధర్ 2 కొల్లగొట్టింది. ధురంధర్ 2 చూసాక.. కథ ఇంకా మిగిలి ఉందని ఎవరూ అనుకోరు. హంజా ఏ లక్ష్యం కోసమైతే పాకిస్తాన్ వెళ్తాడో.. దాన్ని పూర్తి చేసాకే ఇండియాకు వస్తాడు. అక్కడితో కథ అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ నిర్మాత జ్యోతి దేశ్ పాండే మాత్రం ధురంధర్ 3 ఉంటుందని.. అది కూడా 2026 చివర్లోనే స్వీట్ సర్‌ప్రైజ్ వింటారని చెప్పారు.. దాంతో పార్ట్ 3పై ఆసక్తి పెరిగిపోతుంది. అనౌన్స్ చేసినంత ఈజీ కాదు ధురంధర్ 3ని ముందుకు తీసుకెళ్లడం..! రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ సినిమాకు కమిటయ్యారు.. ఇది పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. ఏదో క్రేజ్ ఉంది కదా అని ఫ్రాంచైజీలో పార్ట్ 3 చేస్తే ధురంధర్ బ్రాండ్‌కే బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆచుతూచి అడుగులు వేయాలంటున్నారు ఫ్యాన్స్. చూడాలిక ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: గుడ్ న్యూస్.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్ | పెద్ది కోసం రంగంలోకి ధోని
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Siri Hanumanth: ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

