AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi:  సాయి పల్లవి దెబ్బకు ట్రెండింగ్‌లో ఆ సినిమా

Sai Pallavi: సాయి పల్లవి దెబ్బకు ట్రెండింగ్‌లో ఆ సినిమా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 11, 2026 | 6:27 PM

Share

సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా రామాయణం సినిమాపై కీలక అప్‌డేట్స్ వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రలో నటిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం మిథిలా సెట్‌లో సీత స్వయంవరం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలో సాయి పల్లవి షూటింగ్‌లో చేరనున్నారు. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి ఇతర ప్రాజెక్టులతోనూ బిజీగా ఉన్నారు.

రామాయణ సినిమాకు సంబంధించిన 2 టీజర్స్ వచ్చాయి.. అంతే అవి తప్పితే మళ్లీ ఇప్పటి వరకు సినిమాపై ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వట్లేదు. కనీసం షూటింగ్ ఎంతవరకు వచ్చిందో కూడా ఐడియాలేదు. మే 9న సాయి పల్లవి పుట్టిన రోజు. దాంతో రామాయణ షూట్‌పై మేజర్ న్యూస్ బయటికొచ్చింది. మరి అదేంటి..? ఇంతకీ సినిమా అనుకున్న టైమ్‌కు వస్తుందా..? మే 9న సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలిపారు ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు కేవలం రామాయణపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఈమె సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రామాయణ షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా ముంబైలోని ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ కోసం మిథిలా సెట్ వేసారు. ఈ సెట్‌లోనే సీతా స్వయంవరం సన్నివేశాలు చిత్రీకరించారు. సాయి పల్లవి మరి కొన్ని రోజుల్లోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. కొన్ని రోజులుగా రావణుడి పాత్రపైనే కంటిన్యూస్ షూట్ జరుగుతుంది. రణ్‌బీర్ కూడా ఇదేవారంలో షెడ్యూల్‌లో చేరనున్నారు. రామయాణతో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు సాయి పల్లవి. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న D55తో పాటు.. కల్కి 2లోనూ ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమాలోనూ పల్లవినే హీరోయిన్‌గా తీసుకున్నారు. మొత్తానికి వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బర్త్ డే బ్యూటీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

Follow Us