Indian Navy SSC Jobs 2026: పదో తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అవివాహిత కుర్రకారుకు భలే ఛాన్స్!
ఇండియాన్ నేవల్ అకాడమీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోసం అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ నోటిఫికేష్ విడుదల చేసింది. 2027 జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది..

కేరళ రాష్ట్రంలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ).. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోసం అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ నోటిఫికేష్ విడుదల చేసింది. 2027 జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. మొత్తం 15 ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మే 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 2027 జనవరి కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా ఇంటర్‌లో ఇంగ్లిషు సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ, బీఎస్సీతో పాటు ఎంసీఏ చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు తప్పనిసరిగా జనవరి 1, 2002 నుంచి జులై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.56100తోపాు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఎంపికైన వారు 6 వారాల పాటు కేరళలోని ఎజిమలలో శిక్షణ పొందవల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్ధులు వివాహం చేసుకోరాదు. శిక్షణలో ఉండగా ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ అభ్యర్థిని తొలగిస్తారు. ఎన్‌సీసీ అభ్యర్థులు ‘సి’ సర్టిఫికేట్ లేదా కనీసం ‘బీ’ గ్రేడ్ అయినా ఉండాలి. వీరికి కటాఫ్ మార్కులలో 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభంలో 10 సంవత్సరాలు, అవసరాన్ని బట్టి మరో 4 సంవత్సరాలు సర్వీస్ కాలం పొడిగించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 16, 2026.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 1, 2026.
ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




