AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాస్ట్‌లీ కాంబినేషన్స్..రూ.1200 కోట్లకు పైమాటే.!

కాస్ట్‌లీ కాంబినేషన్స్..రూ.1200 కోట్లకు పైమాటే.!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 11, 2026 | 5:49 PM

Share

ప్రస్తుతం భారతీయ సినిమా, ముఖ్యంగా టాలీవుడ్‌లో కథ కంటే 'క్రేజీ కాంబినేషన్లకే' ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరో, దర్శకుల కలయికల కోసం నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్‌లు వెచ్చిస్తున్నారు. కథ లేకపోయినా కాంబినేషన్ బాగుంటే బిజినెస్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ ధోరణి మహేష్ బాబు-రాజమౌళి, రామ్ చరణ్-సుకుమార్ వంటి భారీ ప్రాజెక్టులలో స్పష్టంగా కనిపిస్తోంది.

కథ తర్వాత ముందు కాంబినేషన్ కలిస్తే చాలు అంటున్నారు మేకర్స్. నిజంగా ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందా..? కాంబినేషన్ కోసమే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారా..? కథ ఉన్నా లేకపోయినా పర్లేదు ముందు కాంబోను కలిపేస్తే చాలు.. బిజినెస్ అదే అవుతుందని నమ్ముతున్నారా..? అసలేం జరుగుతుంది ఈ కాంబినేషన్స్ విషయంలో..? ముందు కాంబినేషన్.. తర్వాతే కథ.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమాలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. క్రేజీ కాంబినేషన్ కోసమే వందల కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. కావాలంటే చూడండి రాజమౌళి, మహేష్ బాబు కాంబో ఇప్పటిది కాదు.. 15 ఏళ్ళ కింద కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ కాంబోకే 400 కోట్లు పెట్టేస్తున్నారు నిర్మాత. వారణాసి కోసం మహేష్ రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. ఇక రాజమౌళి వాటా తీసుకుంటున్నారు. వీళ్లకు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తోడవ్వడంతో కాంబినేషన్ మరింత కాస్ట్‌లీ అయిపోయింది. సేమ్ సీన్ రామ్ చరణ్, సుకుమార్ విషయంలో జరుగుతుంది. పుష్ప తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్ట్ కాబట్టి కథ కంటే కాంబినేషన్‌పై వందల కోట్లు ఖర్చవుతుంది. జూలై నుంచి సుకుమార్, చరణ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. కాంబోకే 200 కోట్లకు పైగా ఖర్చు అయితే.. కథ సెట్టై విడుదలయ్యే నాటికి ఆ లెక్క 400 కోట్లకు చేరడం ఖాయం. మరోవైపు బాలయ్య, కొరటాల సినిమాకు కథ లేదు కానీ కాంబినేషన్ కలపడానికే నిర్మాతకు 100 కోట్ల వరకు ఖర్చు అయిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్‌తో ఏ దర్శకుడి కాంబినేషన్ కలిపినా బడ్జెట్ కనీసం 300 కోట్లకు పైగానే ఉంటుందిప్పుడు. పుష్ప తర్వాత ఆయన రేంజ్ అలా ఉంది. అలాంటిది అపజయమే ఎరుగని అట్లీతో సినిమా కోసం ప్రొడక్షన్ కాస్ట్ పక్కన బెట్టి వీళ్లిద్దరి కోసమే 400 కోట్లు పెడుతుంది సన్ పిక్చర్స్. అలాగే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కాస్ట్ 300 కోట్లు అనే టాక్ నడుస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

Published on: May 11, 2026 05:47 PM
Follow Us