AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ మొదలైన టికెట్ రేట్ల యుద్ధం

మళ్లీ మొదలైన టికెట్ రేట్ల యుద్ధం

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 11, 2026 | 6:23 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్లెక్సీ టికెట్ రేట్లపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ, కంటెంట్ నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. వీకెండ్స్, వీక్ డేస్‌లో ధరలు మార్చడం ద్వారా జనాలను ఆకర్షించవచ్చని నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే, ఒకేసారి రేట్లు భారీగా పెంచితే ప్రేక్షకులు మరింత దూరం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫ్లెక్సీ రేట్లను సరైన పద్ధతిలో అమలు చేయడమే విజయానికి కీలకం.

థియేటర్లకు ఆడియన్స్ రావట్లేదు.. రావడం మానేసారని ఫిక్సైపోయారు నిర్మాతలు. కానీ కంటెంట్ విషయంలో మాత్రం ఎవరూ మాట్లాడరు. ఫుట్ ఫాల్స్ పెరగాలంటే ఫ్లెక్సీ రేట్ ఒక్కటే మార్గం అంటున్నారు వాళ్లు. ఇంతకీ ఈ ఫ్లెక్సీ రేట్ అంటే ఏంటి..? దానివల్ల థియేటర్స్‌కు మళ్లీ కళ పెరుగుతుందా..? ఇతర ఇండస్ట్రీల్లో వర్కవుట్ అవుతున్న ఫ్లెక్సీ ఫార్ములా మనకు సెట్ అవుతుందా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. తెలుగు ఇండస్ట్రీలో ఫ్లెక్సీ టికెట్ రేట్లపై మరోసారి చర్చ మొదలైంది.. వీకెండ్స్‌లో ఒక రేట్, వీక్ డేస్‌లో మరో రేట్ ఉంటే ఫ్లెక్సీ ప్రైస్ అంటారు. బెంగళూరు, ఢిల్లీ, బాంబే లాంటి మెట్రో సిటీస్‌లో ఇది అప్లై అవుతుంది. తెలుగులో కూడా ఇదే చేయాలని నిర్మాతలు GO కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఫ్లెక్సీ రేట్లపై GO తెచ్చుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ దాన్ని సరిగ్గా వాడుకోవాలి. మిగిలిన ఇండస్ట్రీలు ఈ విషయంలో దాదాపు సక్సెస్ అవుతున్నాయి. తెలుగులో ఫ్లెక్సీ రేట్ అని చెప్పి.. పెద్ద సినిమా విడుదలైన ఫస్ట్ 2 వారాలు ఒకేసారి 500 నుంచి 1000 రూపాయల వరకు రేట్ పెంచితే.. థియేటర్‌కు వచ్చే ఆడియన్ కూడా రాడనే భయం కూడా ఉంది నిర్మాతల్లో..! ఇప్పటికే రేట్ల విషయంలో నిర్మాతలపై ఆడియన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. పెద్ద సినిమా విడుదలైతే.. థియేటర్‌కు రావడానికి ఆస్తులు అమ్ముకోవాలా అంటూ నిలదీస్తున్నారు. పుష్ప 2, ఓజి లాంటి బడా సినిమాలకు రేట్లు ఓ రేంజ్‌లో పెంచేసారు. ఓజి అయితే టాక్ బాగున్నా.. రేట్లకు భయపడి థియేటర్లకు దూరంగా ఉన్నారు ప్రేక్షకులు. వీక్ డేస్‌లో తక్కువగా, వీకెండ్స్‌లో ఎక్కువగా రేట్ పెడితే ఓకే.. అలా కాకుండా రేట్లు ఒకేసారి పెంచితే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఎలాగూ థియేటర్లకి జనం రావడం మానేసారనే కారణం చూపిస్తూ.. చిన్న సినిమాలను 2 వారాలకు.. పెద్ద సినిమాలను 4 వారాలకు ఓటిటికి ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ఏదేమైనా ఫ్లెక్సీ రేట్ తెచ్చుకోవడం కంటే దాన్ని వాడుకోవడం తెలియాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

Follow Us