మ్యాగజైన్స్‌పై మాయ చేస్తున్న హీరోయిన్స్
సినిమా షూటింగ్‌లు లేని సమయంలో హీరోయిన్లు తమ క్రేజ్‌ను తగ్గకుండా చూసుకోవడానికి సోషల్ మీడియా, మ్యాగజైన్ ఫోటోషూట్లను ఆశ్రయిస్తున్నారు. రుక్మిణి వసంత్, సారా అర్జున్, కయాదు లోహర్ వంటి యువ తారలతో పాటు సమంత, తమన్నా వంటి సీనియర్ నటీమణులు కూడా ఖాళీ సమయాన్ని ఇలాగే సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్లామర్ షో ద్వారా అభిమానులకు దగ్గరవుతూ, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమాలున్నపుడు ఓకే.. కానీ షూటింగ్స్ లేనపుడు హీరోయిన్లు ఏం చేస్తారు..? కాస్త గ్యాప్ ఇచ్చినా క్రేజ్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాని టార్గెట్ చేస్తున్నారు.. అక్కడ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా కొందరు స్టార్ బ్యూటీస్ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఖతర్నాక్ హాట్ షో చేస్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..? చూస్తున్నారుగా సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోషూట్.. నిజం చెప్పాలంటే ఈమెకు ఫుల్ క్రేజ్ ఉంది కానీ చేతిలో అవకాశాలే తక్కువగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా వైపు వెళ్ళడానికి రుక్మిణికి అవకాశం లేదు. దాంతో మిగిలిన సమయాన్ని ఇలా ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సినిమాలతో పాటు మ్యాగజైన్ కవర్ పేజీపై బిజీ అవుతున్న హీరోయిన్లలో రుక్మిణి వసంత్ తర్వాత చెప్పుకోవాల్సిన పేరు సారా అర్జున్. ధురంధర్ అనే ఒక్క సినిమాతో అమ్మడి పేరు మార్మోగిపోయింది. దాని తర్వాత ఆ రేంజ్ ఆఫర్ కోసం చూస్తున్న సారా.. ఈ గ్యాప్‌లోనే గ్లామర్ క్వీన్ ముద్ర కోసం మ్యాగజైన్ కవర్ పేజీలపై అందాల కవరేజ్ ఇస్తున్నారు. మొన్నే సారా అర్జున్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అయింది. కయాదు లోహర్ సైతం ప్యారడైజ్ మినహా మరే సినిమా చేయట్లేదు.. చేయకూడదు కూడా. అందుకే ఈమె కూడా మ్యాగజైన్ కవర్ పేజీలపై గ్లామర్ షోతో మాయ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు సమంత, తమన్నా కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టైమ్ దొరికినపుడు ఫోటోషూట్స్ వైపు వెళ్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: గుడ్ న్యూస్.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్ప్రైజ్ | పెద్ది కోసం రంగంలోకి ధోని
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Siri Hanumanth: ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

