AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!

Cricket Viral Video: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన, నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అంపైర్ చేసిన ఒక పని బౌలర్‌ను అయోమయానికి గురిచేసింది. వికెట్ పడిందని సంబరపడే లోపే, అంపైర్ కేవలం తన టోపీని సర్దుకోవడంతో బౌలర్ నిరాశతో ఉండిపోయాడు. ఈ వింత దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!
Umpire In Bizarre County Cricket Scene
Venkata Chari
|

Updated on: May 11, 2026 | 10:04 PM

Share

Rashid Khan Umpire Incident: సమర్సెట్ వర్సెస్ గ్లామోర్గాన్ జట్ల మధ్య జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. గ్లామోర్గాన్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో, సమర్సెట్ బౌలర్ క్రెయిగ్ ఓవర్టన్ (చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జేమీ ఓవర్టన్ సోదరుడు) అద్భుతమైన బంతిని వేశాడు. ఆ బంతి బ్యాటర్ ర్యాన్ హాడ్లీ ప్యాడ్లను బలంగా తాకడంతో బౌలర్, ఫీల్డర్లు గట్టిగా అప్పీల్ చేశారు.

సరిగ్గా అదే సమయంలో అంపైర్ తన చేయి పైకి లేపారు. అంపైర్ చేయి ఎత్తగానే అది అవుట్ అని భావించిన ఓవర్టన్, ఎంతో ఉత్సాహంతో గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ, అంపైర్ వేలు చూపించి అవుట్ ఇవ్వలేదు, కేవలం తన తలపై ఉన్న టోపీని సర్దుకోవడానికి మాత్రమే చేయి పైకి ఎత్తారు. నిజం తెలుసుకున్న ఓవర్టన్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు.

గతంలో రషీద్ ఖాన్ విషయంలోనూ ఇలాగే..

ఇలాంటి వింత అనుభవం ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక ఎల్బీడబ్ల్యూ (LBW) అప్పీల్ సమయంలో అంపైర్ తన చేయి పైకి లేపి, అవుట్ ఇచ్చే బదులు ముక్కును రుద్దుకోవడం ప్రారంభించారు. దీంతో రషీద్ ఖాన్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. అంపైర్ల ఇలాంటి సరదా చర్యలు ఒక్కోసారి ఆటగాళ్లలో తీవ్ర అసహనాన్ని, మరికొన్ని సార్లు నవ్వును కలిగిస్తాయి.

సమర్సెట్‌పై గ్లామోర్గాన్ విజయం..

ఈ మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే, గ్లామోర్గాన్ జట్టు సమర్సెట్‌పై ఘన విజయం సాధించింది. ఒకానొక దశలో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న గ్లామోర్గాన్‌ను ర్యాన్ హాడ్లీ, సీన్ డిక్సన్ అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. డిక్సన్ 76 పరుగులు చేయగా, హాడ్లీ 220 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. సమర్సెట్ తరపున క్రెయిగ్ ఓవర్టన్, మిగేల్ ప్రిటోరియస్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టినప్పటికీ, అది వారి జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం