Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..

ఏపీలో అధికారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటితో సరిగ్గా ఐదేళ్లు అని గత అనుభవాలను గుర్తు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్ లో ఉన్న సీఎం జగన్ జూన్ 1న ఇండియాకు తిరిగిరానున్నారు. అయితే గతంలో తన ఫారిన్ టూర్ కు వెళ్లే ఒక రోజు ముందు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Jagan: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..
Cm Jagan
Follow us
Srikar T

|

Updated on: May 30, 2024 | 6:22 PM

ఏపీలో అధికారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటితో సరిగ్గా ఐదేళ్లు అని గత అనుభవాలను గుర్తు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్ లో ఉన్న సీఎం జగన్ జూన్ 1న ఇండియాకు తిరిగిరానున్నారు. అయితే గతంలో తన ఫారిన్ టూర్ కు వెళ్లే ఒక రోజు ముందు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్ టీంకు అభినందనలు తెలిపేందుకు వెళ్లిన సీఎం జగన్ తాము ఈసారి 23 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నామన్నారు. ఈసారి ఏపీ ఫలితాలు చూసి దేశం నివ్వెరపోతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఎనలేని జోష్ కనిపించింది. ఇక పార్టీ శ్రేణులు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు. జూన్ 4న ఫలితాలు విడుదల అయితే.. జూన్ 9న విశాఖ వేదికగా ఉదయం 9.38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవం అటూ  వైఎస్ఆర్సీపీ అధికారిక వెబ్ సైట్లో సందేశాన్నిపోస్ట్ చేశారు. దీంతో పార్టీ నాయకుల్లో సైతం గెలుపుపై ధీమా కనిపిస్తోంది. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసిందని తెలిపారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న ఈ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ది దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తుందని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ జగన్ రెండో సారి అధికారంలో వస్తారన్న ధీమా చాలా మందిలో కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో అన్ని హోటళ్లు, రూములు, బస్సు, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ సైతం బుక్ అయిపోయాయి. కేవలం 7,8,9 తేదీలల్లో మాత్రమే బుకింగ్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అప్పుడే అధికారికంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..