Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భర్తను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్.. ఆడిషన్ పేరుతో అలాంటి సంబంధాలు..

లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తోంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకుంది. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక అరోపణలు చేస్తోంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ.

Watch Video: భర్తను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్.. ఆడిషన్ పేరుతో అలాంటి సంబంధాలు..
Former Miss Vizag Nakshatra
Follow us
Eswar Chennupalli

| Edited By: Srikar T

Updated on: May 30, 2024 | 3:35 PM

లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తోంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకుంది. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక అరోపణలు చేస్తోంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్‎కు చేరింది. విశాఖ దాసపల్లా హిల్స్‎లోని ఒక అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్న నక్షత్ర నేరుగా తన భర్త ఉంటున్న ఫ్లాట్‎కు వెళ్ళింది. అక్కడ మరొక అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గుర్తించింది. నేరుగా ఆ అమ్మాయిపై దాడికి దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దాంతో ఫ్లాట్‎లో ఉన్న అమ్మాయిని పోలీసులు స్టేషన్‎కు తరలించారు.

ఒక సినిమా షూటింగ్‎లో పరిచయం, ప్రేమ, పెళ్లి..

నక్షత్ర 2012లో మిస్ వైజాగ్‎గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో అదే సినీ రంగంలో ఉన్న త్రిపురానేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహానికి దారితీసింది. 2013 లో నక్షత్రను సాయి వెంకట తేజకు పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే ఉన్న తేజ.. ఆ తర్వాత తనలోని లైంగిక వాంఛలను బయటకు చెప్పాడు. తాను అందంగా ఉన్నానని చాలా మంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాలను, లైంగిక వాంఛలకు ఇష్టపడతూ ఉన్నారని నేరుగా తనకే చెప్పారని చెప్తోంది భార్య నక్షత్ర. అలా 2020 లో గొడవలు పెద్దవై కోర్టు దాకా వెళ్ళింది వీరి వ్యవహారం. విడాకులు రాకుండానే వేరే యువతితో ఉన్నారంటూ ఈరోజు ఆ ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది నక్షత్ర. దీంతో ఈ వ్యవహారం పెద్ద గొడవకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

ఆ అమ్మాయి ఆడిషన్ కోసమే వచ్చింది..

అయితే తన సతీమణి వచ్చే సరికి నా రెసిడెన్స్ కం ఆఫీస్‎లో ఉన్న యువతి సినిమా ఆడిషన్ కోసమే వచ్చిందని, తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని మీడియాకు వివరణ ఇచ్చారు సాయి వెంకట తేజ. తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..