Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections: ఏపీలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పేసిన పంచాంగకర్తలు.. సీట్లతో సహా తేల్చేశారు

ఏపీలో ఇప్పుడు బీపీ మిషన్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయ్ అట. ఎందుకంటారా..? ఎన్నికల ఫలితాలకు ఇంకా నాలుగు రోజులే టైం ఉంది. దీంతో నేతలతో పాటు కార్యకర్తల బీపీ రైజ్ అవుతుంది. ఏ ఇద్దరు కలిసినా ఈ టాపికే డిస్కషన్. మా వాళ్లు గెలుస్తారంటే.. మా వాళ్లు గెలుస్తారని ఒకరికి ఒకరు ఛాలెంజులు విసురుకుంటున్నారు.

AP Elections: ఏపీలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పేసిన పంచాంగకర్తలు.. సీట్లతో సహా తేల్చేశారు
Pawan kalyan - CM Jagan - Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: May 30, 2024 | 3:22 PM

ఎన్నికల ఫలితాలపై కోనసీమలో పంచాంగ కర్తల విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ముందే చెబుతున్నామని.. తమకు ప్రిడిక్షన్ విషయంలో చాలా క్రెడిబులిటీ ఉందని చాలామంది చెబుతున్నారు.  ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తేల్చి చెప్పేస్తున్నారు కోనసీమకు చెందిన పంచాగ కర్తలు. నాయకుల జాతకాల ఆధారంగా.. లెక్కలు వేసి.. ఏపీలో గెలుపుఓటములపై వీరు లెక్కలు చెబుతున్నారు. అంతే కాదండోయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు. ముఖమ్యమంత్రిగా ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు.  వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం అటున్నారు తాడేపల్లిగూడెంకి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ. టీడీపీకి 69 స్థానాలే వస్తాయన్నది ఆయన ప్రిడిక్షన్.  తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెబితే.. తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు కూడా ఏపీలో తాను చెప్పిందే నిజం అవుతుంది అంటున్నారు.

టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెబుతున్నారు అమలాపురంకి చెందిన మరో ప్రముఖ పంచాంగ కర్త ఉపదృష్ట నాగాదిత్య. అంతేకాదు  జ్యోతిష శాస్త్ర ప్రకారం.. ఈ పార్టీల అధినాయకుల జాతకాలకు ఈనెల 9, 11తేదీలు ప్రమాణ స్వీకారానికి మంచి రోజు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో పస ఉండదని.. తమ ప్రిడిక్షనే కరెక్ట్ అవుతుందని ఎవరికి వారు చెప్పేస్తున్నారు. రాజకీయ నాయకులు, పార్టీ అధినేతల గ్రహ స్థితులను బట్టి అధికార యోగం ఉంటుందన్నది వారి వెర్షన్. మరి ఎవరి భవిష్యవాణి నిజం అవుతుంది… ఎవరు అధికార పగ్గాలు చేపడతారన్నది తేలాలంటే జూన 4 వరకు ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం పోటీ?
ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం పోటీ?
ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!
ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!
ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇదిగో ఇంత దూరం వచ్చింది...
ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇదిగో ఇంత దూరం వచ్చింది...
2026లో శని సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయం
2026లో శని సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయం
దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌‌గా బుక్
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌‌గా బుక్
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా