AP News: తెలంగాణ నుంచి ఏపీలోకి ఎంటరయిన కారు.. పోలీసులు చెక్ చేయగా కళ్లు జిగేల్
ఎన్నికలు అయిపోయాయ్.. ఇక తనిఖీలు ఉండవ్ అని కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారు. అటు గంజాయితో పాటు ఇటు బంగారం అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. కానీ మీరు అనుకుంటున్నట్లు పోలీసు బాబాయిలు ఏం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లలే. అదే జోరుతో తనిఖీలు చేస్తూ.. ఖతర్నాక్ గాళ్ల ఆట కటిస్తున్నారు.

ఎలక్షన్స్ అయిపోయాయ్ కదా పోలీసులు తనిఖీలు ఉండవ్ కదా అని భ్రమపడుతున్నారు కొందరు. ఈ క్రమంలోనే అక్రమ మార్గాల్లో బంగారం రవాణాకి యత్నించి అడ్డంగా బుక్కవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న గోల్డ్‌ను పోలీసులు సీజ్ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా టంగుటూరులో బంగరం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
కావలి సమీపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చెకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ కారు అటుగా వచ్చింది. అందులోని వ్యక్తులు టెన్షన్ పడుతూ ఉండటంతో.. తనిఖీలు చేయగా 1497 గ్రాముల బంగారంతో పాటు రూ.1.61కోట్ల క్యాష్ బయటపడింది. సరైన పత్రాలు లేకపోవడంతో.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కావలి రూరల్ సీఐ కావేటి శ్రీనివాస్ తెలిపారు.
మరో ఘటనలో ప్రకాశం జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16వ నంబరు నేషనల్ హైవేపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి డ్యాక్యుమెంట్స్, అనుమతులు లేకుండా లేకుండా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి కారులో తరలిస్తున్న సుమారు 1200 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఆ గోల్డ్ స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తితో పాటు మహిళను టంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.