AP Weather: ఆహా.. ఇంతకంటే కూల్ న్యూస్ ఉంటుందా..? ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ వినిపించింది. నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. గురువారం ఉదయం కేరళను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోఆవరణములో నైరుతి/పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయిఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
——————————–
గురువారం: – వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది.
శుక్రవారం, శనివారం : తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది
రాయలసీమ :-
—————-
గురువారం;- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది
శుక్రవారం : తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది
శనివారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది . గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.