AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకరంటే ఒకరికి ప్రాణం.. పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు

వారిద్దరూ మనసుపడ్డారు.. కొంతకాలం నుంచి ఒక‌రినొక‌రు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణంగా.. జీవితాంతం కలిసుండాలని కలలు కన్నారు.. పెద్దలను ఎలాగైన ఒప్పించి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఇద్దరూ.. కలిసి ఇదే విషయాన్ని తమ తమ ఇళ్లల్లో చెప్పారు. కానీ.. పెద్దలు మాత్రం వారి ప్రేమను ఖండించారు..

ఒకరంటే ఒకరికి ప్రాణం.. పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు
Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2024 | 4:11 PM

Share

వారిద్దరూ మనసుపడ్డారు.. కొంతకాలం నుంచి ఒక‌రినొక‌రు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణంగా.. జీవితాంతం కలిసుండాలని కలలు కన్నారు.. పెద్దలను ఎలాగైన ఒప్పించి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఇద్దరూ.. కలిసి ఇదే విషయాన్ని తమ తమ ఇళ్లల్లో చెప్పారు. కానీ.. పెద్దలు మాత్రం వారి ప్రేమను ఖండించారు.. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు.. పెద్దల నిర్ణయంతో మనస్థాపం చెందిన ప్రేమికులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యువతి గొంతుకోసి యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఈ ఘటనలో యువతి మరణించగా.. యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.. ఈ షాకింగ్ ఘటన ఏలూరు సత్రంపాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన యువతి రత్న గ్రెస్, ముసునూరుకు చెందిన యువకుడు యేసు రత్నం.. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరూ వారి వారి ఇళ్లలో చెప్పగా.. ఇరు కుటుంబాలు ప్రేమ పెళ్లికి నిరాకరించాయి. దీంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఏలూరు సత్రంపాడు సాయిబాబా టెంపుల్ వద్ద రత్నపై యేసురత్నం కత్తితో దాడి చేసి చంపాడు.. అనంతరం పీక కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు పరిస్థితి విషమంగా మారింది. రక్తపుమడుగులో పడి ఉన్న యేసురత్నంను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. యువతి ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?