ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..? అసలు వాస్తవాలు ఇవే..
ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థల్ని తిరగరాసే సత్తా ఉన్న క్రూడాయిల్ ధరలకే ఒక లెక్కాపక్కా లేదు. సో, రూపాయి తిరగబడితే, ఆర్థికరంగం అడ్డం తిరిగితే ఓడలు బండ్లు కావడానికి ఎంతో టైమ్ తీసుకోదు. వార్ ఎఫెక్ట్‌తో ఇండియన్ ఎకానమీ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది..? మోదీ హింట్ ఇచ్చినట్టు, రాహుల్ భయపెట్టినట్టు దేశంలో ఆర్థిక ఉత్పాతం తప్పదా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రిపేర్ ఫర్ paranoia..! అంటే ఆర్థిక వ్యవస్థ మతిస్థిమితం తప్పబోతుంది బీఅలర్ట్ అని. ఉదయ్ కోటక్.. కొటక్ మహింద్రా బ్యాంక్ ఫౌండర్. దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థను దగ్గరగా చూసినవాడు. SEBI బోర్డులో పనిచేసినవాడు, 2008 నాటి ఆర్థిక విపత్తును నెట్టుకొచ్చిన అనుభస్థుడు. ఆయన ఇచ్చిన సాలిడ్ వార్నింగ్ ఇది. మరి, సమ్‌థింగ్ బిగ్ ఏదో జరగబోతోందనేగా అర్థం? కానీ, ఇదంతా ఎర్లీ ప్రిడక్షన్.. మన ఆర్థిక రంగం ఆరోగ్యంగానే ఉంది అనే వాయిస్ కూడా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు, కార్పేరేట్ సర్కిల్స్ కాదు, గ్రౌండ్‌లెవల్‌లో జనానికి ఏం అర్థమవ్వబోతోంది. అందరూ చెబుతున్నట్టు అది ఆర్థిక తుఫానా లేక, జస్ట్ టీకప్పులో తుఫానుగా చప్పున చల్లారిపోయేదా? తుఫాను కోసం తీరిగ్గా కూర్చుని వెయిట్ చేయడం కాదు, తుఫాను వస్తే తట్టుకోవడం ఎలాగో నేర్చుకుందాం.. అలా ఐతేనే బతికుంటాం. అని బలుసాకుల కథ చెప్పుకొచ్చారు ఒకానొక బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్. భారత పరిశ్రమల సమాఖ్య-CII గత వారంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన కడుపు చించుకుని ఇలా తన కొలీగ్ కార్పొరేట్లను అప్రమత్తం చెయ్యబోయారు. ఆయనొక్కరే కాదు, మిగతా పారిశ్రామికవేత్తలు చెప్పింది కూడా ఇదే. పశ్చిమాసియాలో టెన్షన్లు ఇండియాను ఎంత కుంగదీస్తాయో.. దేశంలో సమీప ఆర్థికభవిష్యత్తులు ఎంత దుర్భరంగా మారబోతున్నాయో విడమర్చి చెప్పారు. జనం పొదుపు చెయ్యకపోతే, దేశం నష్టపోతుందని హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సందేశం ఇచ్చిన మరుసటి రోజే వినబడ్డ కఠోర...
