CM Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కేవలం వాపు మాత్రమే.. విపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం జగన్
సోషల్ మీడియా నుంచి సంక్షేమ పథకాల వరకూ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని..నెలకు 20 రోజులు జనాల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు ఉపదేశించారు సీఎం జగన్. ఎమ్మెల్యే అయినా.. కార్యకర్త అయినా తనకు అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. అదే టైమ్‌లో గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు.

ముందస్తు ఎన్నికల్లేవ్.! మంత్రివర్గంలో మార్పులూ లేవ్.! బట్ గేర్ మార్చాలి. రెట్టింపు స్పీడ్‌తో పనిచేయాలి. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు జగన్ చేసిన కీలక సూచనలివి. ఏడాదిలో జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడంతో పాటు.. విపక్షాల విష ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు ముఖ్యమంత్రి జగన్. గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, కీలక నేతలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సమావేశం నిర్వహించిన జగన్.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ గేర్ మార్చి.. రెట్టింపు స్పీడ్‌తో పనిచేయాలని ఆదేశించారు. అయితే గతానికి భిన్నంగా వార్నింగులు ఇవ్వకుండా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా నుంచి సంక్షేమ పథకాల వరకూ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని..నెలకు 20 రోజులు జనాల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు ఉపదేశించారు సీఎం జగన్. ఎమ్మెల్యే అయినా.. కార్యకర్త అయినా తనకు అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. అదే టైమ్‌లో గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పొగొట్టుకోనని.. మీతోనే పనిచేయించి.. మళ్లీ గెలిపించాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కేవలం వాపు మాత్రమేనని చెప్పారు.
13 నుంచి జగనన్నకు చెబుదాం..
ముందస్తు ఎన్నికలు, ఎమ్మెల్యేల మార్పు, మంత్రివర్గ విస్తరణ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు మంత్రులు. ఇక ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మాకొట్టడం ఆసక్తికరంగా మారింది. రావడం లేదని సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక ఈ నెల 13న జగనన్నకు చెబుదాం ప్రారంభించాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం కానప్పుడు నేరుగా సీఎంవో అధికారులతో మాట్లాడేలా కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా రూపకల్పన చేశారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
