Chandrababu: మాటలు కాదు, చేతల్లో చూపించే నేత ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మనందరి భవిష్యత్తును కాపాడే నేతని.. సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా అహర్నిశలు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మనందరి భవిష్యత్తును కాపాడే నేతని.. సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా అహర్నిశలు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మోదీ లాంటి నేతను చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. మాటలతో కాదు చేతలతో చూపించే నాయకుడు మోదీ అన్నారు. సూపర్ GSTతో సూపర్ సేవింగ్.. సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. GST సంస్కరణలు తెచ్చిన మోదీకి ధన్యవాదాలు చెప్పారు.
మనశక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్‌తో మోదీ చూపించారని.. రాబోయే శతాబ్దాలకు మోదీ పునాది వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 2038నాటికి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతామన్నారు. మాటలు కాదు, చేతల్లో చూపించే నేత అని.. ఇలాంటి నేతను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. చాలామంది ప్రధానమంత్రులతో పనిచేశానని.. కానీ.. ప్రధాని మోదీ లాంటి వ్యక్తిని చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్ తెచ్చారని… జీఎస్టీతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15 వేలు ఆదా అవుతుందన్నారు. అన్ని వర్గాలకు మేలుచేసేలా మోదీ సంస్కరణలు ఉన్నాయన్నారు.




