AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: జైళ్లలో వీఐపీ స్పెషల్ కేటగిరీ ఉంటుందా? అసలు ప్రముఖులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసా?

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన ఏపీ సర్కార్. ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. ఇది అందరికి తెలిసిన విషయమే.. కానీ జైలుకు ప్రత్యకంగా ఇంటి నుండి భోజనం , మందులు తెపించుకునేందుకు విజయవాడ ఎసిబి కోర్టు అనుమతిని కూడా మంజూరు చేసింది. స్పెషల్ క్లాస్ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది.

Chandrababu Arrest: జైళ్లలో వీఐపీ స్పెషల్ కేటగిరీ ఉంటుందా? అసలు ప్రముఖులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసా?
Chandrababu Naidu
M Sivakumar
| Edited By: Basha Shek|

Updated on: Sep 15, 2023 | 1:11 PM

Share

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన ఏపీ సర్కార్. ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. ఇది అందరికి తెలిసిన విషయమే.. కానీ జైలుకు ప్రత్యకంగా ఇంటి నుండి భోజనం , మందులు తెపించుకునేందుకు విజయవాడ ఎసిబి కోర్టు అనుమతిని కూడా మంజూరు చేసింది. స్పెషల్ క్లాస్ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా?.. అలా చేస్తే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు. 1894 ప్రిజన్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అంటే జైళ్ల చట్టం అమలులోకి వచ్చింది. అనంతరం వివిధ కారణాలతో ఆ చట్టానికి మార్పులు చేర్పులు జరిగాయి.. అయితే జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ అని ఉండదని ప్రెజన్స్ అధికారులు చెప్తున్నారు. అయితే ఖైదీకి ఉన్న ఆర్ధిక స్థాయి స్తోమత , జీవన శైలి , హొదా ను పరిశీలించి ఆతర్వాత స్పెషల్ క్లాస్ ఖైదీగా పరిగణిస్తారని అధికారులు అంటున్నారు. అందుకు అనుగుణంగా సదరు వ్యక్తి న్యాయస్థానం నుండి ప్రత్యక అనుమతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానం ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తే జైలులో ప్రత్యక గది బెడ్ , రైడింగ్ టేబుల్ , అల్మారా , ఏసీ ,ఫ్రిజ్ ,టివి లాంటి సౌకార్యాలు కల్పిస్తారు. వారు ఇంటి నుండి సరుకులు తెపించుకొని జైలులో వండించుకొని తినొచ్చు. వంట ఓండే వ్యక్తిని జైలు అధికారులు కేటాయిస్తారు. లేదా న్యాయస్థానం అనుమతితో ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు.

జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యక బ్యారెట్లు ఉంటాయి. వాటిలో ఉండే ప్రత్యక గదులను వారికి కేటాయిస్తారు. విఐపిలకు స్పెషల్ సౌకర్యాలు కల్పించాలనే నిబంధన జైళ్ల శాఖ పరిధిలోని అంశం కాదని ,కోర్టు అనుమతితోనే ప్రత్యక సౌకర్యాలు కల్పిస్తారరని అధికారులు చెప్తున్నారు.. వారికి కేటాయించే గదులకు ఎటాచ్డ్ బాత్ రూమ్స్ ఉంటాయి . వారి దుస్తులు ఉతికేందుకూ కూడా మనిషిని కేటాయిస్తారని చెప్తున్నారు. స్పెషల్ క్లాస్ అనేది అడిగిన వారి అందరికి ఇవ్వకపోవచ్చు జైళ్ల శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి కావాల్సిన పత్రలను కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటి రిటన్స్ సహా పలు డాకుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది ప్రముఖుల విషయంలో న్యాయవాది వినతిపై కూడా స్పెషల్ క్లాస్ ఇవ్వవచ్చు. ప్రముఖులు జైలులో ఖైదీలుగా ఉన్న సమయంలో వారి భద్రత విషయంలో ఆందోళన ఉంటుంది. కానీ ఒక్కసారి జైలులోకి ప్రవేశించిన తర్వాత వారి భద్రత చూడాల్సిన బాధ్యత జైళ్ల శాఖ పైన ఉంటుంది. వారికి ప్రభుతం కేటాయించిన గన్మెన్ లను వ్యక్తిగత భద్రత సిబ్బందిని జైలులోకి రానివ్వరు. ఆయుధాలతో జైలులోకి రావడం చట్టవిరుద్దం కావడంతో భద్రత సిబ్బందిని జైలులోకి రానివ్వరు. ఇన్నాళ్ల చంద్రబాబుకు భద్రత కల్పించిన NSG గన్ మెన్ లకు కూడా జైలు లోకి వెళ్లే వీలుండదని అధికారాలు చెప్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి