బరితెగిస్తున్న పెట్రోల్ దొంగలు..
శ్రీకాకుళంలో బైక్ పెట్రోల్ దొంగలు పెట్రేగిపోతున్నారు. కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి.. రాత్రి అయితే చాలు ఇంటి బయట పార్క్ చేసిన వాహనాల్లోని పెట్రోల్‌ని కొట్టేస్తున్నారు. ఆ పెట్రోల్ అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారు. తాజాగా.. వారి గ్యాంగ్‌లో ఓ వ్యక్తి బర్త్ డేను ఘనంగా నిర్వహించాలని.. నగరంలోని పలు వాహనాల్లోని భారీగా పెట్రోల్‌ను దొంగతనం చేస్తున్నారు. రాత్రంతా రోడ్లపై తిరుగుతూ.. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల్లోని పెట్రోల్‌ను కాజేశారు. ఈ […]
శ్రీకాకుళంలో బైక్ పెట్రోల్ దొంగలు పెట్రేగిపోతున్నారు. కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి.. రాత్రి అయితే చాలు ఇంటి బయట పార్క్ చేసిన వాహనాల్లోని పెట్రోల్‌ని కొట్టేస్తున్నారు. ఆ పెట్రోల్ అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారు. తాజాగా.. వారి గ్యాంగ్‌లో ఓ వ్యక్తి బర్త్ డేను ఘనంగా నిర్వహించాలని.. నగరంలోని పలు వాహనాల్లోని భారీగా పెట్రోల్‌ను దొంగతనం చేస్తున్నారు.
రాత్రంతా రోడ్లపై తిరుగుతూ.. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల్లోని పెట్రోల్‌ను కాజేశారు. ఈ దొంగతనాలు మొత్తం.. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మరోవైపు.. బర్త్‌డే జరుపుకుంటున్న హిమశేఖర్.. అతివేగంగా బైక్ నడిపించి ప్రమాదానికి గురై చనిపోయాడు. ఇంకో వైపు పెట్రోల్ దొంగతనాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కొంతమంది కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్ల దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.