విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు అరెస్ట్
విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్ని రాకెట్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేశ్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. గత సంవత్సరం జులైలో జరిగిన కిడ్ని రాకెట్ కేసులో పురోగతి వివరాలను విశాఖ నగర కమిషనర్ మహేష్ లడ్డా గురువారం మీడియాకు వివరించారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, దొడ్డి ప్రభాకర్ ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఏ2 నిందుతుడైన బీఎస్ […]
విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్ని రాకెట్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేశ్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. గత సంవత్సరం జులైలో జరిగిన కిడ్ని రాకెట్ కేసులో పురోగతి వివరాలను విశాఖ నగర కమిషనర్ మహేష్ లడ్డా గురువారం మీడియాకు వివరించారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, దొడ్డి ప్రభాకర్ ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఏ2 నిందుతుడైన బీఎస్ ప్రభాకర్ నుంచి శ్రద్ధ హస్పిటల్ యాజమాన్యం 23 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. దీనిలో 12లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. హస్పిటల్ యాజమాన్యం కిడ్ని దాత, కిడ్ని గ్రహీతకు సోదరుడిగా నకిలీ ఆధార్ కార్డు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిందని అన్నారు. కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం ఐదు లక్షలు చెల్లించారు. మిగతా ఏడు లక్షలు చెల్లించకపోవడంతో బాధితుడు పార్థసారిథి పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ తెలిపారు. కిడ్నీ రాకెట్ వ్యవహరంలో ప్రధాన నిందితుడు మంజునాథ్ కు శ్రద్ధ హస్పిటల్ యాజమాన్యానికి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు శ్రద్ధ హస్పిటల్ లో 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తేలిందని సీపీ పేర్కొన్నారు. అవన్నీ చట్ట ప్రకారం జరిగినవా కాదా అనే విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు.