AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ చిన్నపొరపాటు.. కన్నకొడుకును కాటేసి.. కంటశోకాన్ని మిగిల్చింది..

చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డలను గమనించుకుంటూ ఉండండి.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కన్నేసి ఉంచితే బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకోవాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. ఆనందంగా సాగిపోతున్న ఓ సంసారం.

ఓ చిన్నపొరపాటు.. కన్నకొడుకును కాటేసి.. కంటశోకాన్ని మిగిల్చింది..
Auto Accident
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 02, 2024 | 5:59 PM

Share

గుడివాడ, ఫిబ్రవరి 02: చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డలను గమనించుకుంటూ ఉండండి.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కన్నేసి ఉంచితే బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకోవాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. ఆనందంగా సాగిపోతున్న ఓ సంసారం. ముద్దు ముద్దు మాటలు పలికే ఓ బాబును ఎంతో మురిపెంగా చూసుకుంటున్న నాలుగేళ్ళ చిన్నోడు. ఆటో నడపగా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఏ చీకు చింత లేకుండా.. ఉన్నదానిలోనే సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. కానీ విధి వెక్కిరించి.. జీవనోపాధి కల్పించే ఆటోని, కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది ఈ ఘటన. అప్పటి వరకు బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసిన ఆ బాలుడు ఆటో శబ్దం విని తన తండ్రి వచ్చాడని గుర్తించి హడావిడిగా బయటకు వచ్చాడు. కానీ అక్కడే మృత్యువు ఎదురుచూస్తుందని గ్రహించలేకపోయారు. ఆ తల్లిదండ్రులు.. ఆటో పార్కింగ్ చేసి తన బిడ్డను ఎత్తుకుందామని తండ్రి భావించాడు. చేస్తుండగా ఎనక ఉన్న పిల్లవాడు ఆటో కింద పడిపోయిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనంగా మారింది.

కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన వరి గంజి మురళీకృష్ణ, రుచిత భార్యాభర్తలు. మురళీకృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు రిషిక్ , మూడు నెలల కుమార్తె ఉంది. గత బుధవారం ఆటో పార్క్ చేస్తున్న సమయంలో ఆటో రివర్స్‎లో వస్తున్న క్రమంలో కుమారుడు రిషిక్ ఆటో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే ఆటోలో గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు తల్లిదండ్రులు. రిషిక్‎ను పరిశీలించిన డాక్టర్లు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు వైద్యులు.

బాలుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు పగిలేలా రోధించారు. దేవుడా ఇలా చేశావు ఏంటయ్యా అంటూ విలపించారు. కనీసం గాయాలతోనైనా నా కొడుకుని బతికిస్తే బాగుండే అని గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు స్థానిక ప్రజలను కంటతడి పెట్టించింది. బంధువులు సైతం బాలుడి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోధించారు. దీంతో కృష్ణాజిల్లా మోటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌