Visakhapatnam: వెన్నులో వణుకు పుట్టించే ప్రమాదం.. తునాతునకలైన కారు.

దొండపర్తి ప్రాంతానికి చెందిన పూర్ణచంద్ర, భాను ప్రకాష్ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ స్నేహితులు వంశి రెడ్డి, సాయిరాం తో కలిసి.. భాను ప్రకాష్ కు చెందిన కారులో విహారానికి బయలుదేరారు. బీచ్ రోడ్ లో రాత్రి గడిపి.. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. పూర్ణచంద్ర కారు డ్రైవ్ చేస్తున్నాడు. జూపార్క్ దాటిన తర్వాత..

Visakhapatnam: వెన్నులో వణుకు పుట్టించే ప్రమాదం.. తునాతునకలైన కారు.
Car Accident
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Narender Vaitla

Updated on: Feb 02, 2024 | 4:57 PM

విశాఖపట్నంలోని జూ పార్క్ బీచ్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ పైనున్న స్థంబాన్ని ఢీకొనడంతో.. పూర్ణచంద్ర అనే యువకుడు ప్రాణాలకు కోల్పోగా.. మరో ముగ్గురు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ ప్రమాదం తరువాత ఆ కారు, స్పాట్ లో భయానక దృశ్యాలు కనిపించాయి.

దొండపర్తి ప్రాంతానికి చెందిన పూర్ణచంద్ర, భాను ప్రకాష్ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ స్నేహితులు వంశి రెడ్డి, సాయిరాం తో కలిసి.. భాను ప్రకాష్ కు చెందిన కారులో విహారానికి బయలుదేరారు. బీచ్ రోడ్ లో రాత్రి గడిపి.. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. పూర్ణచంద్ర కారు డ్రైవ్ చేస్తున్నాడు. జూపార్క్ దాటిన తర్వాత సీతకొండ వైపు వెళుతున్న క్రమంలో విశాఖ వ్యాలీ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ దాటింది. ఆ వెంటనే మలుపు వద్ద కారు అదుపు తప్పి, డివైడర్‌ను తాకుకుంటూ కరెంటు పోల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న పూర్ణచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ప్రయానిస్తున్న పూర్ణ సోదరుడు భాను ప్రకాష్, వంశి రెడ్డి, సాయిరాం తీవ్ర గాయలతో ఆసుపత్రి లో చేరారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. యాక్సీడెంట్ స్పాట్‌లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ ఫ్రాంట్ వీల్ నుంచి డ్రైవర్ కూర్చునే కారు కుడి వైపు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద తీవ్రతకు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా.. డ్రైవర్ పూర్ణ చంద్ర ప్రాణాలు దక్కలేదు. కారు కుడి వైపు రెండు అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం జరుగుతుందని తెలిసి తప్పించుకునే ప్రయత్నం చేశాడో ఏమో గాని.. రెప్పపాటులో ప్రమాదం జరిగి ఫ్రంట్ డోర్‌లో చేయి కూడా ఇరుక్కుపోయింది.

స్పీడ్ బ్రేకర్ దాటగానే..

జూ పార్క్ వైపు నుంచి నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా.. సీత కొండ వైపు వెళ్లే క్రమంలో తొలుత విశాఖ వ్యాలీకి వెళ్లే పాయింట్‌ను వాహనమైన క్రాస్ చేయాల్సి ఉంటుంది. అదే స్పాట్‌లో ఓ స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. ఎంత హై స్పీడ్ లో వచ్చినప్పటికీ.. స్పీడ్ బ్రేకర్ వద్ద దాదాపుగా పది నుంచి 15 కిలోమీటర్ల స్పీడ్ లోనే ఏ వాహనమైన ఉండాలి. స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే.. 50 మీటర్ల దూరంలోనే ఓ మలుపు. అక్కడే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పీడ్ బ్రేకర్ ను రాసుకుంటూ వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడ వరకు వెళ్లాలంటే.. అంతకు ముందున్న స్పీడ్ బ్రేక్ వద్ద ఏ వాహనమైన స్లో అవ్వాల్సిందే.

కానీ ఈ ప్రమాద తీవ్రత చూస్తే.. దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించి ఉంటుందని పోలీసులు అనుమనిస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ దాటక కేవలం 50 మీటర్ల దూరంలోనే కారు ఆ స్థాయిలో వేగం ఎలా పుంజుకుంటుంది..? పోనీ వేగంగా వెళ్లకపోతే ఆ స్థాయిలో ప్రమాదం ఎలా జరుగుతుంది..? స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ కారు అంత తీవ్రమైన ప్రమాదానికి గురి కాదనేది పోలీసుల అభిప్రాయం. మరి ఓవర్ స్పీడ్ లోనే స్పీడ్ బ్రేకర్ కూడా దాటి అదుపు చేయలేక డివైడర్ను రాసుకుంటూ కరెంటు పోల్ను కారు ఢీ కొట్టిందా..? లేక మలుపు తిరుగుతున్న సమయంలో కంట్రోల్ కాకపోవడంతో బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ పై కాలు వేయడంతో కారు మరింత స్పీడ్ పెరిగి ఘోరమైన ప్రమాదానికి గురైందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

సోదరుడి కారులోనే…

ఘటనకు కారణమైన కారు.. మృతుడు పూర్ణచంద్రకు సోదరుడైన భాను ప్రకాష్‌దే. అదే కారులో భాను ప్రకాష్ కూడా ఉన్నాడు. భాను.. ఓన్ క్యాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా.. వీరి స్నేహితుడు వంశి రెడ్డి మద్యం షాప్‌లో సేల్స్ మెన్‌గా, సాయిరాం స్వీగ్గీలో పనిచేస్తున్నట్టు స్నేహితులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!