Police Warning: కంటైనర్లలో వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు ప్రచారం.. పోలీసులు ఏం చేశారంటే..?
తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కడప పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. దేశ రక్షణ శాఖకు సంబందించిన సామాగ్రిని చెన్నై నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కడప ఫిబ్రవరి 2: తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కడప పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. దేశ రక్షణ శాఖకు సంబందించిన సామాగ్రిని చెన్నై నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కంటైనర్లలో రూ. వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టారు కొందరు దుండగులు.
దీంతో తప్పుడు వార్తలు ప్రచారం చేసే నెటిజన్లకు కడప డీఎస్‌పీ ఎం.డీ. షరీఫ్ గట్టి హెచ్చరిక చేశారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్‌పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్ తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…