AP News: విశాఖ రైల్వే జోన్ ఆలస్యానికి కారణమెవరిది.? కేంద్రానిదా.! రాష్ట్రానిదా.!

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వేదికగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదం మరోసారి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని ఇవ్వనందునే రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమైందని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ సర్కార్.

AP News: విశాఖ రైల్వే జోన్ ఆలస్యానికి కారణమెవరిది.? కేంద్రానిదా.! రాష్ట్రానిదా.!
Ysrcp Vs Bjp
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Feb 02, 2024 | 4:57 PM

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వేదికగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదం మరోసారి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని ఇవ్వనందునే రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమైందని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ సర్కార్. జనవరి 2వ తేదీన జీవీఎంసీ కమిషనర్ 52.22 ఎకరాలను ఇస్తూ రైల్వేశాఖకు ఇచ్చిన లేఖను విడుదల చేసిన ప్రభుత్వం. వాల్తేర్ డివిజన్‌పై అస్పష్టత, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వేల మధ్య ఆస్తుల వివాదం, ఉద్యోగుల కేటాయింపు పరిష్కరించడం లాంటివి బీజేపీకి చేతకాక తమపై నిందలు వేయడం సరికాదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 2013లో నగర అభివృద్ది కోసం తీసుకున్న 52.22 ఎకరాల రైల్వేస్థలానికి ప్రత్యామ్నాయం చూపించని అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదే తప్పని విమర్శించింది ఏపీ సర్కార్. ముడసర్లోవలో సర్వే నంబర్ 57-65 వరకు ఉన్న వివాదం లేని భూమిని రైల్వేకు అప్పగించినా.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు వేయడం అన్యాయం అంటోంది జగన్ ప్రభుత్వం.

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలులో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ ఇటీవలకాలంలో తరచూ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రతీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. బీజేపీతో పాటు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటుకు 52.22 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంలో ఆలస్యం చేస్తోందన్నారు. జోన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన అశ్వనీ వైష్ణవ్ ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే 9,138 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. ఈ మేరకు రైల్వేజోన్‌ను ప్రస్తావించినప్పుడు స్పందించారు.

అశ్వనీ వైష్ణవ్ ప్రకటనపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం..

అశ్వనీ వైష్ణవ్ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. విశాఖలో అభివృద్ధి పనుల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుందని, అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరిందని ప్రభుత్వం చెబుతోంది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు జరిగిన సంగతి ఇదని.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసిన ప్రభుత్వం ఆ హామీకి అంతకుముందు రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదన్నారు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాల్సిందిపోయి.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన.

అసలు వాల్తేర్ డివిజన్‌పై ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతోందని, వాల్తేరు డివిజన్ లేకుండా అసలు సౌత్ కోస్ట్ జోన్ ఎలా ఏర్పడుతుందని.. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వేల మధ్య ఆస్తుల వివాదం అలానే ఉందని, ఉద్యోగుల కేటాయింపు లాంటి మౌలిక అంశాలకు పరిష్కరించడం బీజేపీకి చేతకాక తమపై నిందలు వేయడం సరికాదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా 2014 తర్వాత రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉందని.. అప్పుడు సైలెంట్‌గా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూమి అప్పగించకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్పడం ఏంటని విమర్శిస్తోంది. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసిందని.. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించి, వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుని రైల్వేశాఖకు లేఖ రాశామని ప్రభుత్వం చెబుతోంది. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ ఓల్డ్ సర్వే 69లో రైల్వేశాఖకు అప్పగించామని ప్రభుత్వం చెబుతోంది.

స్థలం స్వాధీనం చేసుకోమని చెప్పినా.. రైల్వేశాఖ స్పందించలేదు.

సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటనపై ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్‌లో చీఫ్ సెక్రటరీ రైల్వేకు ఇవ్వాల్సిన స్థలంపై మీటింగ్ పెట్టారని, ఓల్డ్ సర్వే నంబర్ 26లో 52.22 ఎకరాలును కేటాయిస్తూ అప్పుడే నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్. అంతకుముందు నుంచి ఉన్న వివాదాలను పరిష్కరించి ల్యాండ్‌ను అప్పగించేందుకు 2024 జనవరి 2న కేంద్ర రైల్వేశాఖకు లేఖ కూడా రాశామని స్పష్టం చేశారు. స్థలం అప్పగించేందుకు ఎవరినైనా పంపాలని కూడా రైల్వే శాఖను కోరామన్నారు కలెక్టర్. ఈ అంశం అంతా రైల్వేశాఖలో ఆలస్యం కావచ్చునేమో గానీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలసత్వం ఎంతమాత్రం లేదంటూ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున వివరణ ఇచ్చారు. దీంతో కొత్త టర్న్ తీసుకున్న ఈ వివాదంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!