Andhra Pradesh: ‘రమ్మనండి.. అడిగేస్తా’.. చంద్రబాబుపై సోమువీర్రాజు ఆగ్రహం..
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ ప్రజలను మభ్యమపెడుతున్నారని...

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ ప్రజలను మభ్యమపెడుతున్నారని తూర్పారబట్టారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో సీబీఐ తిరగకూడదు, కేంద్ర ప్రభుత్వం సంస్థలు పని చేయకూడదు అని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరిని తాను ఖండిస్తున్నానని అన్నారు. ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రాష్ట్రమంతా తిరిగేందుకు అనుమతి ఇచ్చానని చెబుతున్నారు. ఆనాడే జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశ్నించారు సోము వీర్రాజు.
అసలు చంద్రబాబే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారని, అలాంటి వ్యక్తి నేడు సభలు పెడుతూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు వీర్రాజు. అంతా కేంద్రమే చేసిందని చంద్రబాబు అనడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. మరోమారి అడ్డమైన కామెంట్స్ చేస్తే తాము కూడా చంద్రబాబు గురించి చాలా విషయాలు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు వీర్రాజు.
చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్ర హోమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే అడ్డుగా నిల్చురన్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని గుర్తుచేశారు వీర్రాజు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని హితవు చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదని పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్‌ను ఆయన ముందు మీడియా ప్రతినిథులు ప్రస్తావించగా.. సోము వీర్రాజు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. పవన్, చంద్రబాబులు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారని, తమది జాతీయ పార్టీ కాబట్టి అక్కడి నేతలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము నడుచుకుంటామన్నారు.




‘ఒకసారి బీజేపీకి నోటాకి వచ్చిన ఓట్లుకూడా రాలేదని విమర్శలుచేస్తారు.. తిరిగి తామే కావాలని కోరుకుంటారు. చంద్రబాబు గతంలో కేంద్రంలో చక్రం తిప్పారు కదా, ఐదుగురు ప్రధానులను మార్చారని అంటారు కదా.. అలాంటి చంద్రబాబుకు అనాడు రైల్వేజోన్ ఒక వెంట్రుకతో సమానం. మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు. చంద్రబాబును రమ్మనండి ఆయన్నే అడిగేస్తా.’ అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
