Chandrababu: ఏపీలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి.. మంత్రుల జాబితా ఇదే..

ఆంధ్రప్రదేశ్‎లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 24 మందితో మంత్రుల జాబితా సిద్దంగా ఉంది. అందులో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు కల్పించారు. కేబినెట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు వారసుడు నారా లోకేష్‌కు చోటు దక్కింది. చంద్రబాబు కాకుండా కేబినెట్లో సోషల్ ఇంజనీరింగ్ ఇలా ఫాలో అయ్యారు. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 కేబినెట్ బెర్తులను కేటాయించారు.

Chandrababu: ఏపీలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి.. మంత్రుల జాబితా ఇదే..
Chandrababu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 12, 2024 | 11:35 AM

ఆంధ్రప్రదేశ్‎లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 24 మందితో మంత్రుల జాబితా సిద్దంగా ఉంది. అందులో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు కల్పించారు. కేబినెట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు వారసుడు నారా లోకేష్‌కు చోటు దక్కింది. చంద్రబాబు కాకుండా కేబినెట్లో సోషల్ ఇంజనీరింగ్ ఇలా ఫాలో అయ్యారు. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 కేబినెట్ బెర్తులను కేటాయించారు. అలాగే ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. టెక్కలి ఎమ్మెల్యే, సీనియర్ నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు మళ్లీ మంత్రులు కాబోతున్నారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌, సీనియర్‌ పొలిటీషియన్‌‎తో పాటు నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్న పొంగూరు నారాయణకు కేబినెట్‌లో చోటు లభించింది. టీడీపీలో యాక్టివ్‌ పర్సన్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్‌ యాదవ్‌‎లు మంత్రులుగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఇక పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన నిమ్మల రామానాయుడు, మైనార్టీ నేత ఎన్ఎండీ ఫరూక్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. సీనియర్‌ నేత ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి మంత్రిగా ప్రమాణం చేస్తుండగా.. టీడీపీలో తొలిసారి అధికారపక్ష ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్‌కు లక్కీగా మంత్రిపదవి దక్కింది. అనగాని సత్యప్రసాద్, పార్థసారథి కూడా చంద్రబాబు టీమ్‌లో ఉన్నారు. అలాగే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే డా.డోలా బాలవీరాంజనేయస్వామి, అదే జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవులు లభించాయి. జనసేన నేత కందుల దుర్గేష్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సంధ్యారాణి కూడా పదవులు పొందారు. బీసీ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. ఎస్. సవిత, వాసంసెట్టి సుభాష్‌ తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తొలిసారి ఎమ్మల్యేలుగానే కాకుండా.. మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇప్పటికే గవర్నర్ నజీర్‌కు మంత్రుల జాబితాను పంపారు చంద్రబాబు. నేడు సీఎంగా చంద్రబాబుతో సహా 25మంది మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. బెజవాడ నుంచి కేసరపల్లి వరకు మూడు పార్టీల జెండాల రెపరెపలతో కళకళలాడుతోంది. అభిమానులు పెద్ద ఎత్తున కదలివస్తున్నారు. 7వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో ప్రజలు వీక్షించేందుకు పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. పాసులు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. వీఐపీలు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

ఇవి కూడా చదవండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి