Chandrababu Naidu: ఒకరోజు ముందే ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో డిన్నర్.. ప్రమాణస్వీకారం వేడుకకు భారీ ఏర్పాట్లు..
చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను మరోసారి పాలించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది..
చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను మరోసారి పాలించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఈ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
14 ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం.. 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు రెండు లక్షల మంది కూర్చుని ప్రమాణ స్వీకారాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పది వేల మంది పోలీసులలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక VVIPలు, VIPలతోపాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలతోపాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే 7 వేల మంది పోలీసులతో భారీభద్రతను కూడా ఏర్పాటు చేశారు. అన్నిమార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రేపు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు.
రాత్రికి చేరుకోనున్న అమిత్ షా..
మరోవైపు ఇవాళే ఏపీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేరుకోనున్నారు. రాత్రి 9:30 కి గన్నవరం ఎయిర్ పోర్టుకు అమిత్ షా రానున్నారు. రాత్రి 10:20 కి సీఎం చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతారు. డిన్నర్ అనంతరం రాత్రికి 11:20 కి నోవోటెల్ కు చేరుకుని బస చేయనున్నారు.
స్కూల్స్ రీఓపెన్ ఎల్లుండికి వాయిదా..
చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా రేపు రీఓపెన్ కావాల్సిన స్కూల్స్ ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మరోవైపు గ్రామాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు సంబరాలతో ఏపీలో పసుపు పండగ కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..