AP Weather Update: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో.. ప్రయాణీకులు, ప్రజలు అవస్థలు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగడం తో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.

AP Weather Update: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు..
Andhra Weather Update
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: May 01, 2023 | 9:47 AM

ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో.. ప్రయాణీకులు, ప్రజలు అవస్థలు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగడం తో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గుంటూరు జిల్లాలో మాచర్ల, అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, క్రోసూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కల్లాల్లో తడిచిన ముద్దయిన మిరప, మొక్కజొన్న.. ఫలితంగా రైతుల కంట కన్నీరు తప్ప నోట మాట రావడంలేదు. కడియం వెంకట్రావు అనే వ్యక్తి పిడుగు పడి మృతిచెందాడు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సోమవారం కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మంగళవారం మన్యం,అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌,సత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..