Minister Anil Kumar: ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదు.. కేటాయింపులకు లోబడే నిర్మాణాలు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jun 21, 2021 | 4:28 PM

ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం  సరికాదని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ ఆరోపిస్తోందని ఇది సరికాదన్నారు.

Minister Anil Kumar: ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదు.. కేటాయింపులకు లోబడే నిర్మాణాలు
AP Minister Anil Kumar Yadav

Follow us on

ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని వివరణ ఇచ్చారు.  తెలంగాణలో మాత్రం అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని మండిపడ్డారు.

రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉంది. ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్‌ ముందుంటారని తెలిపారు. అయితే తాము ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదని అన్నారు. 840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదు. వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తామన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారని అభిప్రయాపడ్డారు. ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే గొప్ప మనిషి తమ ముఖ్యమత్రి అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయి. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే తాము ప్రయత్నం చేస్తున్నాట్లుగా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి : CM KCR: మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన..

IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu