Tadepalli Rape Case: తాడేపల్లి ఘటనపై తీవ్రంగా స్పందించిన జనసేన నేత.. వారిపట్ల సాఫ్ట్ కార్నర్ ఎందుకంటూ..?

Tadepalli Rape Case: తాడేపల్లి అత్యాచార ఘటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Tadepalli Rape Case: తాడేపల్లి ఘటనపై తీవ్రంగా స్పందించిన జనసేన నేత.. వారిపట్ల సాఫ్ట్ కార్నర్ ఎందుకంటూ..?
Potina Mahesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 21, 2021 | 4:34 PM

Tadepalli Rape Case: తాడేపల్లి అత్యాచార ఘటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఈ మేరకు సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. మహిళల రక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కనీస బాధ్యత లేదని విమర్శించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే యువతిపై అత్యాచారం జరిగినా ఇప్పటి వరకు సీఎం స్పందించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ తక్షణం బాధితులను పరామర్శించి అండగా నిలిచి సహాయం చేయాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.

మహిళలను కాపాడలేని దిశా చట్టాన్ని కేవలం ప్రచారం కోసమే తీసుకువచ్చారని విమర్శలు గుప్పించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతున్న బెస్ట్ పోలీసింగ్ అవార్డులు.. షో కేసులో పెట్టుకోవడానికే పనికివస్తాయని అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని దుయ్యబట్టారు. కడప, చిత్తూరు జిల్లాల్లో యువతుల గొంతు కోసి, కాల్పులు జరిపినా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల పట్ల పోలీసులకు ఎందుకు సాఫ్ట్ కార్నర్? అని ప్రశ్నించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు యంత్రాంగాన్ని మహేష్ డిమాండ్ చేశారు.

Also read:

Board Exam: 12వ తరగతి పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ.. ఆ మూడు రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో