Tadepalli Gang Rape: తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో కీలక పురోగతి.. ఒకరి అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు..
Tadepalli Gang Rape: గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న...
Tadepalli Gang Rape: గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. సీతానగరం పుష్కరఘాట్ వేదికగా కొందరు దుండగుల ముఠా దోపిడీలు, చైన్ స్నాచింగ్, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేల్చారు. కాగా, సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నదీ తీరంలో స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు. యువతి అత్యాచారానికి గురైన పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. వారిలో ఒకరిని గుర్తించి ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also read: