AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI: అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు…

NRI : అమెరికాలోని ఆస్టిన్‌లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. మాదినేని సాయి ప్రవీణ్ కుమార్ జలపాతంలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.

NRI: అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు...
Sai Praveen Kumar
Shiva Prajapati
|

Updated on: Jun 21, 2021 | 3:46 PM

Share

NRI : అమెరికాలోని ఆస్టిన్‌లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. మాదినేని సాయి ప్రవీణ్ కుమార్ జలపాతంలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అమెరికాలోని అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఈ నెల 18వ తేదీన స్నేహితులతో కలిసి జలపాతంలో ఈతకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు జారపడిపోవడంతో ఆ జలపాతంలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అధికారులు ప్రవీణ్ కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది. దాంతో ప్రవీణ్ స్నేహితులు, సన్నిహితులు హతాశులయ్యారు.

సరదా ట్రిప్ కాస్తా.. విషాదంగా మారిందని కన్నీరు మున్నీరయ్యాడు. కాగా, ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అత్తలూరు. ప్రవీణ్ మరణ వార్త మియాపూర్‌లో వారి నివాసంతో పాటు.. స్వస్థలమైన అత్తలూరులోనూ విషాదం నింపింది. చేతికందిన కొడుకు దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Also read:

Best Fielders: మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆల్‌ టైం సూపర్ ఫీల్డర్స్‌..! వారెవరంటే..?