CM KCR: మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన..

వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకకు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య‌, విజ్ఞాన విశ్వ‌విద్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

CM KCR: మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన..
Cm Kcr Foundation Stone
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 21, 2021 | 4:57 PM

వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకకు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య‌, విజ్ఞాన విశ్వ‌విద్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వ‌ర్సిటీ వ‌ద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సూపర్​ స్పెషాలటీ ఆస్పత్రికి భూమి పూజ చేశారు.

ఐదు ఎక‌రాల స్థ‌లంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అంత‌కుముందు హ‌న్మ‌కొండ‌లోని ఏక‌శిలా పార్కులో జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

సెంట్రల్‌ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక‌ 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సైతం సీఎం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి : CM KCR: మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన..

IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..