AP Schools: ఏపీ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి
రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ...
రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని స్పష్టం చేశారు. విద్యాకానుకలో ఈ సారి డిక్షనరీ కూడా అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. 15వేల స్కూల్స్‌ను ‘నాడు నేడు’ కింద అభివృద్ధి చేసామన్నారు. మొదటి దశ ‘నాడు నేడు’ను ఆరోజున ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అదే రోజు రెండో విడత ‘నాడు నేడు’ పనులను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ లోపు టీచర్లందరికీ వాక్సినేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దానికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు ఆన్లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. ఎవరైనా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… “ఆగష్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే విద్యాకానుక కిట్ల పంపిణీపై సమీక్ష నిర్వహించి అదనంగా డిక్షనరీలు కూడా జతచేయాలని సూచించారు. నూతన విద్యావిధానంపై అపోహలు తొలగించాలని.. దానిపై సమగ్ర వివరణ స్కూల్స్ రీ-ఓపెన్ రోజున ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా.. సుమారు 16 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలు ఆధునీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు” అని మంత్రి పేర్కొన్నారు.
Also Read:సంచలనం.. తెలంగాణలోని ఆ మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు మిస్సింగ్
సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు
అమ్మాయి టిక్ టాక్ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..
భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్ కమిటీ సంచలన నిర్ణయం..