AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్‌ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు

రోడ్డుపై పెద్ద.. పెద్ద శబ్దాలతో బైక్స్ నడపుతూ హడావిడి చేస్తే.. ఇకపై కథ వేరే ఉంటుంది. అవును.. తాజాగా ఇలా న్యూసెన్స్ చేసే...

Anantapur: సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్‌ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు
Anantapur Police
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2021 | 12:26 PM

Share

రోడ్డుపై పెద్ద.. పెద్ద శబ్దాలతో బైక్స్ నడపుతూ హడావిడి చేస్తే.. ఇకపై కథ వేరే ఉంటుంది. అవును.. తాజాగా ఇలా న్యూసెన్స్ చేసే జులాయిలకు అనంతపురం ట్రాఫిక్ పోలీసులు సరైన గుణపాఠం రుచి చూపించారు. కొందరు ఆకతాయిలు బైక్‌కు సైలెన్సర్లు మార్చి పెద్ద, పెద్ద శబ్ధాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ రైడ్ చేయడం చాలా సరదా అనుకుంటారు. అలాగే పెద్ద శబ్ధాలు చేసే వెరైటీ హారన్స్ ను కూడా పెట్టుకున్నారు. ఇది పబ్లిక్ కి ఎంత న్యూసెన్సో వారికి అర్థం కావడం లేదు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి.  అందుకే అనంతపురం ట్రాఫిక్ పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇలా సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బుల్లెట్లను గుర్తించి వాటి సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైక్ నడిపే వారికి జరిమానాలు వేశారు. మరోవైపు పెద్ద శబ్ధం చేసే హారన్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి వాటిని పెట్టుకుని బైక్ రైడ్ చేస్తే ఏమవుతుందో శాంపిల్ చూపించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను, హారన్స్‌ని వరుసగా రోడ్డుపై వేసి రోడ్డు రోలర్ ద్వారా తొక్కించారు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇకపై ఎవరైనా ఇలాంటి సైలెన్సర్లు వాడితే బైక్‌లు కూడా సీజ్ చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు ఇష్టానుసారం బైక్ నడిపే వారికి ఒక గుణపాఠం అని చెప్పక తప్పదు.

Also Read:  ‘పెద్దారెడ్డి నీ ఫేస్ టర్న్ చేసి అద్దంలో చూసుకో’.. విమర్శల పదును పెంచిన జేసీ

హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి