AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadipatri: ‘పెద్దారెడ్డి నీ ఫేస్ టర్న్ చేసి అద్దంలో చూసుకో’.. విమర్శల పదును పెంచిన జేసీ

అనంతపురం రాజకీయాల్లో తాడిపత్రి సెగలు కక్కుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి....

Tadipatri: 'పెద్దారెడ్డి నీ ఫేస్ టర్న్ చేసి అద్దంలో చూసుకో'.. విమర్శల పదును పెంచిన జేసీ
JC vs. Peddareddy,
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2021 | 11:32 AM

Share

అనంతపురం రాజకీయాల్లో తాడిపత్రి సెగలు కక్కుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యారు. ‘పెద్దారెడ్డి నీ ఫేస్ టర్న్ చేసి అద్దంలో చూసుకో.. నిన్ను చూసి ఓట్లు ఎవరూ వేయలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌ వాడుతున్నావంటూ అబ్జెక్షన్‌ చెప్పారు. తాడిపత్రిలో నడిరోడ్డు మీదకు వస్తా.. రా చూసుకుందామంటూ సవాల్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి. ‘కమీషన్ల కోసం ఇంట్లో నాలుగు బాక్సులు పెట్టుకున్నావ్… తాడిపత్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నీ భార్యని కూడా ఇందులోకి లాగావు..’ ఇది కరెక్ట్‌ కాదన్నారు. గతంలో ఎన్ని ఇళ్లు కూలుస్తామని చెప్పావ్.. ఇప్పుడు ఎన్ని కూల్చావంటూ ప్రశ్నలు సంధించారు. నీకు దమ్ముంటే ‘నా మీద ఛార్జి షీట్ వేయించు.. జైలుకు పంపించు’ అంటూ  సవాల్‌ విసిరారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.

 అసలు గొడవ ఎక్కడ రాజుకుందంటే…

ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీస్‌ జారీ చేశారు. 6 రోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. అయితే వీరిలో టీడీపీకి సపోర్ట్‌ చేసిన సీపీఐ కౌన్సిలర్‌ కూడా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. ‘గత 30 ఏళ్లుగా వారంతా ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, నీకు కౌన్సిలర్‌ కావాలంటే నేనే మీ పార్టీలోకి పంపిస్తానంటూ’ కామెంట్ చేశారు జేసీ. ఇలా స్టార్టయిన మాటల యుద్దం.. విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కింది.

Also Read: హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త

దోచేస్తున్నారు.. చెక్కేస్తున్నారు.. ప్రకాశం జిల్లాలో పెరుగుతోన్న వైట్‌ కాలర్‌ క్రైమ్స్..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి