Jagadish Reddy Vs Komatireddy: వారివి చిల్లర రాజకీయాలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 29, 2021 | 2:09 PM

రోజు రోజుకు కోమటిరెడ్డి సోదరులు వర్సెస్ మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  తాజాగా మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

Jagadish Reddy Vs Komatireddy: వారివి చిల్లర రాజకీయాలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..
Minister Jagadishreddy

రోజు రోజుకు కోమటిరెడ్డి సోదరులు వర్సెస్ మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  తాజాగా మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆ ఇద్దరు సోదరులు దివాలాకోరు రాజకీయాల చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము ఏమైనా  కాంగ్రెస్‌ పార్టీ నాయకులమా.. వాళ్ల నోటికి భయపడటానికి… వాళ్ల బాసులనే తరిమి తరిమి కొట్టినోళ్లమంటూ మండిపడ్డడారు. వీళ్లంతా ఆంధ్రోళ్ల కింద బానిసలుగా పనిచేసినోళ్లు అంటూ వారిపై విమర్శలు గుప్పించారు.

ప్రజల్లో ఉండలేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెండింగ్ ప్రోజెక్టుల పెరు వాడుతున్నారని అన్నారు. పదవులను అడ్డం పెట్టుకుని సంపాదించే వారికి ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. మంత్రుల మైక్ గుంజుకుని రౌడీలాగా ప్రవర్తిస్తూ దౌర్జన్యం చేస్తున్న కోమటిరెడ్డి సోదరులను చిల్లరగాళ్లుగా అభివర్ణించారు.

కార్యక్రమం అనంతరం స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఓ ఫంక్షన్‌ హాల్‌లో వేచిఉన్న కార్యకర్తల వద్దకు వెళ్లిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జిల్లా రైతుల ఉసురు తీసింది ఈ ఇద్దరు అన్నదమ్ములే అని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గానికే రాకుండా ప్రొటోకాల్‌ పేరుతో రాద్ధాంతం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడులో రేషన్‌కార్డుల పంపిణీ అనంతరం ఓ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిలుపునివ్వడంతో ఇటు కాంగ్రెస్‌ అటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మునుగోడుకు చేరుకున్నారు. ఉద్రిక్తతల నడుమ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి కేవలం లబ్ధిదారులనే అనుమతించారు.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..

TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu