Crime News: దోచేస్తున్నారు.. చెక్కేస్తున్నారు.. ప్రకాశం జిల్లాలో పెరుగుతోన్న వైట్‌ కాలర్‌ క్రైమ్స్..

ప్రకాశం జిల్లాలో వైట్‌ కాలర్‌ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఫైనాన్స్ బిజినెస్ పేరుతో ఇదంతా జిల్లాలో కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది

Crime News: దోచేస్తున్నారు.. చెక్కేస్తున్నారు.. ప్రకాశం జిల్లాలో పెరుగుతోన్న వైట్‌ కాలర్‌ క్రైమ్స్..
Frauad
Ram Naramaneni

|

Jul 29, 2021 | 10:17 AM

ప్రకాశం జిల్లాలో వైట్‌ కాలర్‌ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఫైనాన్స్ బిజినెస్ పేరుతో ఇదంతా జిల్లాలో కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం చీరాల పొలిమేర రోడ్డులో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ లిమిటెడ్‌ కంపెనీ నుంచి.. నేటి వేటపాలెం కో ఆపరేటివ్‌ సొసైటీ వ్యవహారం వరకూ ఇదే పరిస్థితి.. ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో ఇటీవల ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 100 కోట్లకు పైగా జనానికి చెల్లించకుండా దుకాణం కట్టేశాడు. కారంచేడులో మరో ఫైనాన్స్‌ వ్యాపారి ఇదే తరహాలో చీట్ంగ్ చేసి, ఐపీ పెట్టాడు.

డబ్బులు ఏ రకంగా ఇచ్చినా తిరిగొస్తుందనే నమ్మకమే పోతోందంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. వరుసగా చోటుచేసుకుంటున్న ఆర్థిక మోసాలే ఇందుకు కారణం. మోసం స్థాయి కోట్లల్లో ఉంటుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో చీరాలలో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ నుంచి మొదలు ఇటీవలి వేటపాలెం సొసైటీ వరకు అంతా నమ్మకంగా ముంచేస్తున్నారు. కారంచేడులో ఐపీ పెట్టిన మద్యం వ్యాపారి, పర్చూరు, యద్దనపూడి మండలాల్లో మిర్చి రైతులను మోసం చేసిన కొనుగోలుదారులు, కొత్తపేటలో శ్రీవారి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి రాత్రికి రాత్రి దుకాణం సర్దుకుని చెక్కేసిన ఘరానా పెద్ధమనుషుల వరకు చీట్ ఫండ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన అన్ని ఘటనల్లో సొమ్ములిచ్చిన జనమే మోసపోయారు. ఎక్కువమంది బాధితులుగా ఉన్న ఇలాంటి కేసుల్లో న్యాయం చేయాల్సిన పోలీసులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అదనుగా చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని అక్రమార్కులు కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమీచేయాలో.. డిపాజిట్ దారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also Read: పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి హత్య కేసులో ఊహించని కోణం.. స్వలింగ సంపర్కమే కారణం

 జంబో ‘పనస’.. వెయిట్ ఎంతో తెలిస్తే షాకవుతారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu