Lovers Video: మీకు దొరికితే మమ్మల్ని విడదీస్తారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం. వైరల్ వీడియో. చివరికి ఏమైందంటే..
Lovers Selfie Suicide: పెద్దలు ప్రేమకు ఒప్పుకోవట్లేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోకుండా బలవన్మరణాలకు...
Lovers Selfie Suicide: పెద్దలు ప్రేమకు ఒప్పుకోవట్లేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో చోటు చేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతున్నారని ఓ ప్రేమ జంట కూల్ డ్రింక్‌లో క్లోరైడ్ కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళితే.. తంబల్లపల్లి మండలం కోటాల పంచాయతీ ఎగువబోయనపల్లికి చెందిన శివ ప్రత్యూష (17), మహేష్‌లు గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు. శివ ప్రత్యూష నిమ్మనపల్లి మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతుండగా.. మహేష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వీరి వ్యవహారం తెలుసుకున్న ప్రత్యూష కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రత్యూష ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు మార్చి 19న తంబళ్లపల్లె పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట కుమ్మరివాండ్ల పల్లి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్ డ్రింక్‌లో క్లోరైడ్ కలుపుకుని తాగుతూ ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నామంటూ తీసుకున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియాలో ప్రేమ జంట మాట్లాడుతూ.. తాము దొరికితే ఎలాగైనా విడతీస్తారని. కాబట్టి కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రేమజంటను వెంటనే అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ జంటకు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read: Black magic: కరోనా కల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే
Marine Srinivas: మిస్టరిగా మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..
Cyberabad Police: మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు.. 353 మందికి జైలు శిక్ష..