Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! డ్రైవర్‌ మృతి, 20 మందికి గాయాలు

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు..

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! డ్రైవర్‌ మృతి, 20 మందికి గాయాలు
RTC Bus hits Lorry
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 09, 2023 | 2:53 PM

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాకినాడ నుండి కర్నూల్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీ కొట్టింది. బస్సు అదుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బస్సులో ప్రయాణిస్తు్న్న 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. జేసీపీ సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?