ఘోర విషాదం.. వ్యాన్‌లో గ్యాస్‌ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం!

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం (జులై 8) ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురు సజీవదహనమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఘోర విషాదం.. వ్యాన్‌లో గ్యాస్‌ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం!
Gas Explosion In Van
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 09, 2023 | 12:10 PM

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం (జులై 8) ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురు సజీవదహనమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్గోధా జిల్లాలో ప్యాసింజర్లతో వెళుతున్న ఓ వ్యాన్‌లో అమర్చి ఉన్న లిక్విఫైడ్​ పెట్రోలియం సిలిండర్ నుంచి గ్యాస్ లీక్​అయ్యి ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఉన్నారు. అందులో ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డరు. సిలిండర్ పేలిన వెంటనే వ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై పంజాబ్ తాత్కాలిక సీఎం మొహ్సిన్ నఖ్వీ దర్యాప్తుకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.