- Telugu News Photo Gallery Cinema photos Hong Kong born singer, song writer Coco Lee Dies at 48 after suicide attemt
ప్రముఖ సింగర్ మృతి.. డిప్రెషన్‌తో ఆత్మహత్య..
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్ కోకో లీ (48) బుధవారం కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతోన్న సింగర్ కోకోలీ ఈ నెల 4న ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోమాలోకి వెళ్లిన ఆమె ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. .
Updated on: Jul 06, 2023 | 6:19 PM

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్ కోకో లీ (48) బుధవారం కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతోన్న సింగర్ కోకోలీ ఈ నెల 4న ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోమాలోకి వెళ్లిన ఆమె ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

గత కొంత కాలంగా డిఫ్రెషన్‌తో బాధపడుతోన్న లీ దాని నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె పరిస్థితి మరింత విషమించి జులై 2న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో లీని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, జులై 5న మరణించినట్లు వెల్లడించారు.

లీ మృతితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. దాదాపు 30 ఏళ్లపాటు తన కెరీర్‌లో కాంటోనీస్, ఆంగ్లంలో ఎన్నో పాటలు పాడారు. ‘హిడెన్ డ్రాగన్’లోని ‘ఎ లవ్ బిఫోర్ టైమ్’ సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్ అయ్యింది. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్‌గా లీ నిలిచారు.

కోకో లీ 1975లో హాంకాంగ్‌లో జన్మించింది. హాంకాంగ్ కాంటోనీస్‌కి చెందిన తల్లి, మలేషియా తండ్రికి వీరు ముగ్గురు సంతానం. వీరిలో లీ అందరికంటే చిన్నది. లీ పుట్టకముందే ఆమె తండ్రి మృతి మరణించారు. లీ 9 ఏళ్ల వయసున్నప్పుడు తల్లీ, అక్కలతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కోకు షిఫ్ట్ అయ్యారు.

లీ తొలి ఆల్బమ్ 'కోకో లీ'.. అసియాలో అమ్ముడుపోయిన అత్యధిక అల్బమ్‌గా నలినిచింది. లీ మొత్తం 18 స్టూడియో ఆల్బమ్ రికార్డింగ్‌లు చేసింది. మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్టాన్లీ క్వాన్, నో టొబాకో అనే మూడు సినిమాల్లో నటించింది. 1998లో విడుదల చేసిన మాండరిన్ ఆల్బమ్ డి డా డి కేవలం మూడు నెలల్లోనే మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. 2011లో హాంకాంగ్ సప్లై చైన్ కంపెనీ లిమిటెడ్ మాజీ సీఈవో, కెనడియన్ వ్యాపారవేత్త బ్రూస్ రాక్విట్జ్‌ను లీ వివాహం చేసుకుంది.




