Viral Video: గర్భిణీ మహిళ పట్ల పోలీసధికారి అసభ్య ప్రవర్తన.. సస్పెన్షన్ వేటు!
నల్లజాతి గర్భిణీ మహిళతో ఓ పోలీసధికారి దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సదరు మహిళ నేను గర్భవతినని పదేపదే చెబుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెను..
ఫ్లోరిడా: నల్లజాతి గర్భిణీ మహిళతో ఓ పోలీసధికారి దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సదరు మహిళ నేను గర్భవతినని పదేపదే చెబుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెను కారులో నుంచి బయటకు ఈడ్చి చేతులు మెలిపెడుతూ అరెస్టు చేయడం తీవ్ర దుమారానికి తెర తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు పోలీసధికారి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..
ఫ్లోరిడాకు చెందిన హ్యారీ హార్డీ, నెరిల్లియా లారెంట్ అనే నల్లజాతి దంపతులు గత మే నెలలో తమ కారులో రోడ్డుపై ఆగి పానియాలు సేవిస్తున్నారు. ఈ క్రమంలో మాథ్యూ మెక్‌నికోల్, బోకా రాటన్ అనే ఇద్దరు పోలీసధికారులు వారి ఐడెంటిటీ వివరాలు అడగడం వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలో మాథ్యూ అనే పోలీసధికారి దంపతులతో తీవ్ర వాగ్వాదానానికి దిగుతాడు. ఆ తర్వాత ఆరు నెలల గర్భవతైన నుకిల్లియాను చేయిపట్టుకుని కారులో నుంచి బయటికి ఈడ్చి, నేలపై ఆమెను పడేసి చేతులకు హ్యాండ్ కప్స్ వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలో నెరిల్లియా ‘నేను గర్భవతిని. దయచేసి నన్ను వదిలిపెట్టండి’ అంటూ అరవడం వీడియోలో కనిపిస్తుంది.
ఐతే సదరు పోలీసధికారి మాత్రం ఆమె పట్ల ఏమాత్రం కనికరంలేకుండా దరుసుగా ప్రవర్తించడం తీవ్ర దుమారం లేపింది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పైఅధికారులు వెంటనే మాథ్యూని సస్పెండ్ చేయడంతోపాటు, అతనిపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించినట్లు పోలీసు చీఫ్ మిచెల్ మియుసియో డైలీ మెయిల్‌కు నివేదించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.