Dalit atrocity in UP: మరో అమానవీయ ఘటన.. దళిత యువకుడితో కాలి చెప్పులు నాకించి, గుంజిళ్లు తీయించి..
ఉత్తర ప్రదేశ్‌లో దళితులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ గిరిజన యువకుడి ముఖంపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దళితులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ గిరిజన యువకుడి ముఖంపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దళిత వ్యక్తితో ఓ వ్యక్తి తన కాలి చెప్పును నాలుకతో బలవంతంగా నాకించాడు. ఈ అనాగరిక, అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మంచంపై కూర్చున్న ఓ వ్యక్తి తన కాలి చెప్పులను రాజేంద్ర అనే దళిత యువకుడు నాలుకతో నాకించడం కనిపిస్తుంది. అనంతరం చెవులు పట్టుకుని గుంజిళ్లు తీయిస్తాడు. గుంజిళ్లు తీసిన తర్వాత నిందితుడు దుర్భాషలాడుతూ దళిత యువకుడిని బెదిరించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాఖీలు ఎంట్రీ ఇచ్చారు. నిందితుడిని విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న తేజ్‌బాలీ సింగ్‌గా ఖాఖీలు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిసారు.
🚨 Shocking incident in Sonbhadra, Uttar Pradesh! A Dalit individual was forced to lick someone’s feet. This is unacceptable!#CasteAtrocity #EndDiscrimination #Sonbhadra #UttarPradesh pic.twitter.com/9xj8KdUxyz
— Shuja Gandhi (@ShujaGandhi) July 8, 2023
అసలేం జరిగిందంటే..
బాదిత యువకుడు రాజేంద్ర మేనమామ ఇంట్లో కరెంటు సమస్య తలెత్తింది. అ విషయమై అక్కడికి వచ్చిన లైన్‌మ్యాన్ తేజ్‌బాలీ అతనితో వివాదానికి దిగి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. జూన్ 21న ఓ వ్యక్తిని కొట్టినందుకు తేజ్‌పాల్‌పై గతంలో పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. ప్రస్తుతం
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.