Amarnath Yathra: రెండోరోజు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర.. చిక్కుకుపోయన వేలాది మంది యాత్రికులు
అమర్‌నాథ్ యాత్ర రెండోరోజు కూడా నిలిచిపోయింది. అక్కడ కొండ చరియలు విరిగిపడటం, భారీ వర్షాలు కరవడం కొనసాగడంతో అధికారులు రెండోరోజు కూడా యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం వేలాది మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు.

అమర్‌నాథ్ యాత్ర రెండోరోజు కూడా నిలిచిపోయింది. అక్కడ కొండ చరియలు విరిగిపడటం, భారీ వర్షాలు కరవడం కొనసాగడంతో అధికారులు రెండోరోజు కూడా యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం వేలాది మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు. తాజాగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పహల్‌గావ్, బల్తార్ రెండు మార్గాల్లో రాకపోకలతో పాటు యాత్రను ఆపేశారు. దాదాపు అక్కడ 50 వేల మంది బేస్ క్యాంపుల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఒక్క పంజ్‌తర్ణి ప్రాంతంలో 1500 మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. అయితే వీళ్లలో దాదాపు 200 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షాలు కురవడంతో రంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. యాత్రికులు జమ్మూ నుంచి వెళ్లకుండా అధికారులు ఆపేశారు. ఆ తర్వాత అందరిని బేస్ క్యాంపులకు తరలించారు. యాత్రికులందరూ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. పరిస్థితులు కదుటపడ్డాక మళ్లీ యాత్రను ప్రారంభింస్తామని పేర్కొన్నారు. అలాగే యాత్రికుల కోసం అత్యవసర సహాయ కేంద్రాలను తెరిచి అన్నిరకాల సదుపాయలు అందించాల్సిందిగా ఆదేశించాని తెలిపారు. మరోవైపు యాత్రికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా జమ్మూ-కశ్మీర్ తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.