Rahul Gandhi: నా దగ్గర కేటీఎం 390 బైక్ ఉంది.. కాని దాన్ని బయటకు తీయను : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని పలు వీధుల్లో పర్యటించారు. ఇందులో భాగంగా కరోల్‌బాగ్‌లోని ఉన్న బైక్ మెకానిక్ షాపులను ఆయన సందర్శించారు. అలాగే అక్కడ పనిచేసే వర్కర్లతో మాట్లాడారు. అంతేకాకుండా రాహుల్ ఆ వర్కర్లతో కలిసి కొన్ని బైక్‌లను సైతం రిపేర్ చేసేందుకు ప్రయత్నించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని పలు వీధుల్లో పర్యటించారు. ఇందులో భాగంగా కరోల్‌బాగ్‌లోని ఉన్న బైక్ మెకానిక్ షాపులను ఆయన సందర్శించారు. అలాగే అక్కడ పనిచేసే వర్కర్లతో మాట్లాడారు. అంతేకాకుండా రాహుల్ ఆ వర్కర్లతో కలిసి కొన్ని బైక్‌లను సైతం రిపేర్ చేసేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా తనవద్ద దగ్గర ఉన్న బైక్‌పై కూడా ప్రస్తావించారు. అలాగే దాన్ని ఎందుకు కూడా బయటకు తీయడం లేదో వివరించారు. ప్రస్తుతం తన వద్ద కేటీఎం 390 బైక్ ఉందని చెప్పారు. కానీ దాన్ని వినియోగించడం లేదని తెలిపారు. ఎందుకుంటే దాన్ని నడిపేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించరని పేర్కొన్నారు. మీకున్న సమస్యలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని వర్కర్లతో అన్నారు.
అలాగే అక్కడున్న వర్కర్లు రాహల్ గాంధీని పలు ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగగా రాహుల్ మాత్రం స్పందించలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇదిలాఉండగా ఇటీవల ఆయన భారత్ జోడోయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ లారీలో ప్రయాణించడం, తాజాగా ఓ పొలంలో ట్రాక్టర్ నడపడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇలా వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ.








