Janasena New Song: దుమ్మురేపుతున్న ‘జనసేన’ పాట.. వింటే రోమాలు నిక్కబొడవాల్సిందే..
ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎలక్షన్స్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే సమరశంఖం పూరించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే వారాహి విజయ యాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. మొదటి విడత పూర్తయింది. రెండో విడత ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతోంది.
ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎలక్షన్స్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే సమరశంఖం పూరించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే వారాహి విజయ యాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. మొదటి విడత పూర్తయింది. రెండో విడత ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి సంబంధించి జనాన్ని చైతన్య పరిచేందుకు జనసేన ప్రత్యేకంగా రూపొందించిన పాటను విడుదల చేసింది. అలా విడుదలైందో లేదో.. ఇలా సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
మార్పే లక్ష్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ముందుగా ప్రజారాజ్యం కీలక భూమిక పోషించారు. ఆ పార్టీ విలీనం తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తానే స్వయంగా జనసేన పార్టీని స్థాపించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యం అని, అభివృద్ధే తన ధ్యేయం అని ప్రకటించారు పవన్. అయితే, ఇప్పటి వరకు ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతూ వచ్చిన జనసేన అధినేత, ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించారు. ఈసారి మాత్రం ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనాల్లోకి వెళుతున్నారు. జనాల సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. తాజాగా జనసేన ప్రచార గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను తెలంగాణలో ప్రముఖ ఫోక్ సింగర్స్ అయిన మధుప్రియ, నల్లగొండ గద్దర్ ఆలపించడం విశేషం.
జనసేన పార్టీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటకు బుర్రా సతీష్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అయితే మొదటి నుంచి తెలంగాణ ప్రాంతమంటే అభిమానం కురిపించే పవన్ కళ్యాణ్.. ఈ సాంగ్‌ను సైతం ప్రత్యేకంగా ప్రముఖ తెలంగాణ సింగర్స్ మధు ప్రియ, నల్లగొంగ గద్దర్‌తో పల్లె గొంతుకతో పాడించారు.
పవన్ కళ్యాణ్ సైతం తన జనసేన పార్టీ కోసం.. ‘జాగోరో జాగో కదిలింది జనసేన’ అనే పాట చేయించుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..