BAN W vs IND W: అనంతపురం నుంచి అంతర్జాతీయ స్థాయికి.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి
మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో అనంతపురం జిల్లాకు చెందిన అనూష బారెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేతుల మీదుగా అనూష బారెడ్డి టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా మొదటి మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన అనూష వికెట్లు తీయనప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
సుమారు నాలుగు నెలల విరామానికి తెరదించుతూ మళ్లీ మైదానంలోకి దిగింది భారత మహిళల క్రికెట్ జట్టు. గత నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న భారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో అనంతపురం జిల్లాకు చెందిన అనూష బారెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేతుల మీదుగా అనూష బారెడ్డి టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా మొదటి మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన అనూష వికెట్లు తీయనప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి బంగ్లాను కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసింది. పూజ, మిన్ను, షెపాలీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ విజయం దిశగా సాగుతోంది. కడపటి వార్తలందే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
ఇక అనుష విషయానికి వస్తే..అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి ఆమె స్వస్థలం. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మల్లిరెడ్డిలిద్దరూ వ్యవసాయ కూలీలే. పొలం పనులకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి. తల్లిదండ్రులుకు ఆసరాగా ఉండేందుకు కొన్ని సార్లు అనూష కూడా కూలీ పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో తనలోని క్రికెట్ ట్యాలెంట్‌ను గుర్తించాడు స్కూల్ పీఈటీ రవీంద్ర. తనకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించాడు. ఆ తర్వాత రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) అకాడమీ సహాయంతో జిల్లా, రాష్థ్రస్థాయి క్రికెట్ పోటీల్లో సత్తాచాటింది. తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు మూకుతాడు వేసింది. 2023లో జరిగిన ఇంటర్ జోనల్ టోర్నీలో సౌత్‌జోన్ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించింది అనూష. అలాగే హంకాంగ్ వేదికగా కొన్ని రోజలు క్రితం జరిగిన మహిళల వర్ధమాన క్రికెటర్ల కప్‌లో భారత్- ఏ తరఫున అదరగొట్టింది. ఇదే క్రమంలో టీమిండియాలోకి అడుగుపెట్టింది. రవీంద్ర జడేజాను అమితంగా ఆరాధించే అనూష అతనిలాగే టీమిండియాలో రికార్డులు కొల్లగొట్టాలని మనమూ ఆకాంక్షిద్దాం.
Congratulations to Anusha Bareddy and Minnu Mani who make their India debut today in the first T20I against Bangladesh. 🧢😊👍 #TeamIndia #BANvIND pic.twitter.com/WeIYAFEsnW
— BCCI Women (@BCCIWomen) July 9, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..