Tirupati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన కొందరు కారులో తిరుమలకు వెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరారు. ఆ సమయంలో మిట్ట కండ్రిగ దగ్గర కారు.. ముందుగా ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అవగా.. అందులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..